పెట్టుబడులపై Income Tax Department కొత్త నిబంధనలు

Income Tax Department మ్యూచువల్ ఫండ్స్, బ్యాంకు అకౌంట్ హోల్డర్స్, ఫిక్సిడ్ డిపాజిట్ మొదలైనటు వంటి వాటిలో మనీ ట్రాన్సాక్షన్స్ తగ్గించడానికి నిబంధనలను మరింత కఠినతరం చేసింది. ఈ సంస్థల ద్వారా జరిగే నగదు బదిలీలపై ఒక నిర్దిష్ట పరిమితి విధించింది. ఈ పరిమితి నిబంధనల ఉల్లంఘన జరిగినట్లయితే Income Tax Department నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముఖ్యంగా వీటిపై దృష్టి పెట్టండి

Fixed Deposit Schemes : డిపాజిట్ పథకాలలో ఫిక్సిడ్ డిపాజిట్ అనేది సామాన్యులకు ఒక మంచి అవకాశం లాంటిది. అయితే ఈ ఫిక్సిడ్ డిపాజిట్ అనేది రూ.10 లక్షల మించి చేయరాదు. అలా చేస్తే బ్యాంకు డిపాజిటర్ కు ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు వచ్చే అవకాశం ఉంది.

Real Estates : రియల్ ఎస్టేట్ ఒప్పందంలో మీరు ఆస్తిని కొనుగోలు చేసేటప్పుడు లేదా విక్రయించేటప్పుడు దాని పరిమితిని రూ.30 లక్షల కంటే మించరాదని షరతులు విధించింది. అంతకుమించి ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే మీకు ఆదాయపు పన్ను శాఖ నోటీసులు పంపిస్తుంది.

Credit card Bills : క్రెడిట్ కార్డు వాడకం దారులు వారు చెల్లించే బిల్లు అనేది రూ.1 లక్ష పరిమితికి మించి దాటకూడదు. లక్షకు మించి క్రెడిట్ కార్డు బిల్లు చెల్లింపులు జరిపినా కూడా Income Tax Department మీకు ఐటీ నోటీసులు పంపించే అవకాశం ఉంది.

Stock Markets / Mutual Funds : స్టాక్ మర్కెట్స్, మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టే వ్యక్తులు పెట్టుబడి పరిమితి రూ.10 లక్షలకు మించి గనుక పెట్టుబడి పెడితే ఆదాయపు పన్ను శాఖ మీ ఐటీ రిటర్న్ (ITR )ని చెక్ చేసే అవకాశం ఉంది.

Savings / Current Accounts: ఒక వ్యక్తికి సంబంధించిన సేవింగ్స్ అకౌంట్ లో గనుక లక్ష రూపాయలకు పైగా మించి క్యాష్ డిపాజిట్ చేస్తే Income Tax Department నుంచి నోటీసును అందవచ్చు. అదేవిధంగా, కరెంట్ అకౌంట్ హోల్డర్స్ కు ఈ పరిమితి రూ.50 లక్షల వరకు పరిమితి విధించింది. ఈ పరిమితిని ఉల్లంఘిస్తే ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులకు తప్పవు.

Leave a Comment