బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. రాష్ట్రానికి భారీ వర్ష సూచన..!

  • వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడన ప్రభావం
  • మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వెల్లడి
Rain 3final
Rain 4final

హైదరాబాద్‌: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రమైంది. దీంతో వానలు విస్తరంగా కురుస్తున్నాయి.
ఈక్రమంలో తెలంగాణకు మరో రెండ్రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఈమేరకు రాష్ట్రానికి ఒకటో నెంబరు హెచ్చరిక జారీ చేసింది. ప్రభుత్వం అప్పమత్తమై తగిన చర్యలకు తక్షణమే ఆదేశించాలని సూచించింది.

నేడు పలు చోట్ల భారీ వర్షాలు…

రాష్ట్రంలో గత మూడు రోజులుగా ఎడతెరపిలేకుండా వానలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అంతటా మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
శనివారం రాష్ట్రంలో 4.52 సెంటీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. వాస్తవానికి శనివారం నాడు 0.7 సెంటీమీటర్ల సాధారణ వర్షం కురవాల్సి ఉండగా… అందుకు ఆరురెట్లు అధికంగా వర్షం కురనిసింది.
ఖరీఫ్‌ సీజన్‌లో ఇప్పటివరకు 48.8 సెంటీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా… ఇప్పటివరకు 64.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. పలు జిల్లాల్లో రికార్డుస్థాయిలో వర్షపాతం నమోదైంది.
వరంగల్‌ అర్భన్‌ జిల్లాలో 19.1 సెంటీమీటర్లు, వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 18.9 సెంటీమీటర్లు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 13.6 సెం.మీ., భద్రాద్రి కొత్తగుడెం జిల్లాలో 9సెం.మీ., మహబుబాబాద్‌లో 9.2సెం.మీ., కరీంనగర్‌లో 8.9సెం.మీ.ల వానలు కురిశాయి.
తాజాగా ఆది, సోమవారాల్లో రెండ్రోజులు పలు చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.
జయశంకర్‌ భూపాలపల్లి,కరీంనగర్, మూలుగు, వరంగల్, పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది.

Ran 1final
Rain 2final

ఈనెల 19న మరో అల్పపీడనం

ఈ సీజన్‌లో బంగాళాఖాతంలో మూడుసార్లు అల్పపీడనం ఏర్పడగా… ఈనెల 19న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెబుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో కురుస్తున్న వానలతో రోడ్లన్నీ జలమయమై వాగులు పొంగిపొర్లుతున్నాయి.
ఈ నేపథ్యంలో రోడ్డు రవాణా శాఖ, రైల్వే, విమానయాన శాఖలకు తగిన చర్యలు తీసుకోవల్సిందిగా వాతావరణ శాఱ సూచించింది. అదేవిధంగా వాగుల నిర్వహణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టాలని స్థానిక సంస్థల పాలకవర్గాలను హెచ్చరించింది.

Leave a Comment