Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలు

Heavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్‌ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో జనజీవనం స్తంభించి పోయింది. ఉదయం 5 గంటల నుంచి ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. సాయంత్రం వరకు ఇలాగే హైదరాబాద్‌ నగరంలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నగరంలోని పలు ప్రాంతాల్లో ముసురు కొనసాగుతోంది. మరో రెండు రోజులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

రెండు రోజుల పాటు

రేపటి నుంచి రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. రానున్న రెండు రోజులు హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 28 నుంచి 30 డిగ్రీల సెల్సియస్‌, 20 నుంచి 22 డిగ్రీల సెల్సియస్‌ వరకు నమోదయ్యే అవకాశం ఉంది. మంగళవారం నగరంలోని శేరిలింగంపల్లి, షేక్‌పేట్‌, ఆసిఫ్‌నగర్‌లో అత్యధికంగా 4.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, చార్మినార్, ఖైరతాబాద్‌లో 4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని నిజామాబాద్‌లో 27 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, సిర్కొండలో 26.8 మిల్లీమీటర్లు, బోధన్‌లో 25.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

రంగారెడ్డి, వికారాబాద్, నల్గొండ, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేట, జనగాం, మెదక్, సిద్దిపేట, నిజామాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి సహా రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కూడా వర్షాలు కురిశాయి.

Leave a Comment