వాతావరణంలో మార్పులు, నైరుతి రుతుపవనాల ప్రభావంతో మళ్ళీ వర్షాలు మొదలయ్యాయి. కర్ణాటక రాజధాని అయిన బెంగుళూరులో గత రెండురోజుల నుండి భారీ వర్షపాతం నమోదు అవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. సుమారు 45 నుండి 90 మిల్లీ మీటర్ల వర్షపాతం సంభవించినట్టు పేర్కొంది.
ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు వార్డులకు వార్డులే నీట మునిగాయి. రోడ్లు, డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మురుగు నీరు అపార్టుమెంట్లలోకి చేరడంతో సెల్లార్ లోని వాహనాలు నీట మునిగాయి. ఇళ్లలోకి 5 నుండి 6 అడుగుల మేర నీరు చేరడంతో ఇంట్లోని టీవీలు, ఫ్రిడ్జ్ లు మరియు ఇతర విలువైన సామాగ్రి పాడైపోయాయి. హెబ్బాళ మరియు చుట్టుపక్కల అండర్ పాస్ లు నీట మునిగాయి.
విమాన రాకపోకలకు అంతరాయం కలిగింది. అగ్రహార దాసరాహళ్ళి, హెబ్బాళ,హోరమావు ,మూడలపాళ్య లలో అధిక వర్షపాతం నమోదు అయినట్టు వాతావరణ శాఖా పేర్కొంది. మరో రెండు రోజులు ఇలాగే వుండే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …