HTIC IITMadras | మద్రాస్‌ హెచ్‌టీఐసీ అద్భుత సృష్టి..

Pulse 1
  • కరోనా రోగుల కోసం వినూత్న పరికరం
  • వేలికి తొడిగితే చాలు.. మొబైల్‌ ఫోన్‌లోకే సమాచారం
  • మద్రాస్‌ ఐఐటీ అద్భుత సృష్టి

HTIC IITMadras | కరోనా రోగులను పర్యవేక్షించడం డాక్టర్లకు కత్తిమీద సాములా మారింది. పీపీఈ కిట్లు, మాస్కులు ధరించడంతో పాటు తరచూ శానిటైజేషన్‌ తప్పట్లేదు.
అయితే ఇవేవీ లేకుండానే, అసలు రోగి సమీపంలోకి వెళ్లకుండానే రోగి తాలూకూ వివరాలన్నీ తెలుసుకునే అద్భుతాన్ని మద్రాస్‌ ఐఐటీ సాధించింది.

కరోనా రోగుల చికిత్సకు కీలకమైన గుండె కొట్టుకునే వేగం, ఉష్ణోగ్రత, ఊపిరి తీసుకునే వేగం, రక్తంలో ఆక్సిజన్‌ మోతాదులను దూరం నుంచే చూసేందుకు ఓ పరికరాన్ని అభివృద్ధి చేసింది.
హెల్త్‌కేర్‌ టెక్నాలజీ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ( HTIC IITMadras )(హెచ్‌టీఐసీ), హేలిక్సన్‌ అనే స్టార్టప్‌ కంపెనీలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. ఈ పరికరాన్ని రోగి వేలికి తొడిగితే చాలు.. వివరాలన్నీ మొబైల్‌ లేదా సెంట్రల్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌కు చేరతాయి.

Pulse 2
  • రోగి శరీర ఉష్ణోగ్రతలను చంకల నుంచి సేకరిస్తే.. ఆక్సిజన్‌ మోతాదులు, ఇతర వివరాలను వేలి నుంచే తీసుకోవచ్చు.
  • పరికరం స్థాయి, కొలమానాలను బట్టి ధర రూ.2,500 నుంచి రూ.10 వేల వరకూ ఉంటుంది.
  • కరోనా సమయంలో వైద్యులు, నర్సులు రోగుల సమీపానికి వెళ్లే అవసరం లేకుండా చేసేందుకు ఈ పరికరం దోహదపడుతుందని హెచ్‌టీఐసీ ప్రొఫెసర్‌ మోహన్‌శంకర్‌శివప్రకాశం, హేలిక్సన్‌ కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయ్‌శంకర్‌రాజా తెలిపారు.

Leave a Comment