రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వర్గం మీడియా కూడా ఎన్నికలకు నిమ్మగడ్డ సై అంటుంటే ప్రభుత్వమే ఎన్నికలకు నో అంటోంది అంటూ విమర్శిస్తోంది. నిమ్మగడ్డ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న వారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలను ఉదాహరణగా చెబుతున్నారు.
బీహార్లో అసెంబ్లీ కాలం ముగిసిపోతుంది కాబట్టి అక్కడ తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఉందని, స్థానిక సంస్థల విషయంలో అంత పట్టింపు ఏమీ అవసరం లేదని ఇక్కడి మంత్రులు చెబుతున్నారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వాదనకు బలం ఇచ్చే మరో పరిణామం జరిగింది. గుజరాత్లో నవంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. కరోనా కారణంగా అక్కడి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మూడు నెలల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేశారు.
నవంబర్ 3న గుజరాత్ లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. కానీ అసెంబ్లీ ఉప ఎన్నికలకు, స్థానిక సంస్థలకు పోలికే లేదని అక్కడ గుజరాత్ ప్రభుత్వం అభిప్రాయపడింది. స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయాలంటూ గుజరాత్ లో తొలుత డిమాండ్ చేసింది కాంగ్రెస్ పార్టీనే. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సిద్ధిక్ ఏకంగా హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ తర్వాత మరో 20 వినతులు వచ్చాయి.
ఎన్నికలు నిర్వహిస్తే పోలింగ్ విధుల్లో పాల్గొనే తమకు ప్రమాదం ఏర్పడుతుందని అక్కడ ఉద్యోగ సంఘాలు కూడా ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చారు. విచిత్రంగా గుజరాతి టీచర్స్ అసోసియేషన్ తన వినతిపత్రంలో ఆంధ్రప్రదేశ్లో కరోనా వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని గుర్తుచేసింది.
స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అన్నది రెండు లక్షల 80 వేల మంది పోలింగ్ సిబ్బంది, లక్ష మందికి పైగా పోలీస్ బలగాలు, మూడు లక్షల మంది ఏజెంట్లతో పాటు వేలాది మంది ఇతర సిబ్బంది తో ముడిపడిన వ్యవహారం అని అక్కడి ఈసీ అభిప్రాయపడింది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజా కదలిక, సమూహాల ఏర్పాటుకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని దాని వల్ల కరోనా మరింత విజృంభించే ప్రమాదం ఉంటుందని అభిప్రాయపడింది.
అన్ని అంశాలను పరిగణలోనికి తీసుకున్న గుజరాత్ ఎన్నికల కమిషనర్ సంజయ్ ప్రసాద్ ఎన్నికలను మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు అక్టోబర్ 13న ప్రకటించారు. ప్రస్తుతం గుజరాత్లో రోజుకు వెయ్యి వరకు కరోనా కేసులు నమోదవుతున్నాయి. అదే ఏపీలో రోజుకు రెండు వేల వరకూ కరోనా కేసులు నమోదవుతున్నాయి. తక్కువ కేసులున్న గుజరాత్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేయగా ఇక్కడ నిమ్మగడ్డ మాత్రం ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తామనడం సాధ్యం కాదని ప్రభుత్వం చెబుతోంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …