Gorantla Butchaiah Chowdary : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ప్రతిపక్ష హోదా ప్రమాదంలో పడింది. టీడీపీ పార్టీలో మొదలైన ఆగస్టు సంక్షోభం. ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అవడంతో అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇప్పుడు మరో ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమయ్యారు. దీంతో శాసనసభలో టీడీపీ సభ్యులు సంఖ్య మరో నెంబర్ తగ్గుతోంది.
175 మంది ఎమ్మెల్యేలు ఉన్న అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా (Leader of the Opposition ) దక్కాలంటే 10వ వంతు మంది సభ్యులు ఉండాలి. అంటే కనీసం 17 మంది సభ్యులు ఉంటేనే చంద్రబాబుకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఉంటుంది. ఇప్పటికే వల్లభనేని వంశీ, మద్దాల గిరిధర్, కరణం బలరాం, వాసుపల్లి గణేష్ వైసీపీకి జిందాబాద్ కొట్టారు. దీంతో సభలో టీడీపీ సభ్యుల సంఖ్య 19కి చేరింది. వారిని ప్రత్యేక సభ్యులుగా పరిగణిస్తూ స్పీకర్ అసెంబ్లీలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఇప్పుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి కూడా రాజీనామా చేస్తే అసెంబ్లీలో టీడీపీ సభ్యుల సంఖ్య 18కి పడిపోతుంది.
- దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్
- బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. !
- సిఐ నాయక్ పై దాడి.. నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు
- జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ
- పోలీసుల ఎంట్రీతో నీళ్లునమిలిన నక్కా ఆనందబాబు..!
ఉత్తరాంధ్రకు చెందిన మరో టీడీపీ ఎమ్మెల్యే గత కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన నేడో రేపో టీడీపీ పార్టీని వీడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే కూడా ఇదే దారిలో ఉన్నట్లు చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. వీరిలో ఏ ఒక్కరైనా జగన్ కు జై కొడితే చంద్రబాబుకి ప్రతిపక్ష హోదా (Leader of the Opposition) లేకుండా పోతుంది. ( తప్పుచేయకపోతే భయమేల అశోకా? )
ఒకవేళ వీరిద్దరూ టీడీపీలోనే కొనసాగినా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంలో గంటా శ్రీనివాసరావు ఇప్పటికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆమోదించాల్సిగా స్పీకర్ తమ్మినేని సీతారాంను కలిసి విజ్ఞప్తి చేశారు. అంటే చంద్రబాబు ప్రతిపక్ష హోదా అంశం ఇప్పుడు స్పీకర్ చేతిలో ఉందన్నమాట. బుచ్చయ్య రాజీనామా తర్వాత గంట రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే చంద్రబాబు ప్రతిపక్ష హోదాకు గండి పడుతుంది.
అయితే ఇక్కడ మరో తిరకాసు ఉన్నట్లు పరిశీలకులు చెబుతున్నారు. ప్రతిపక్ష హోదా దక్కాలంటే సభలో 10వ వంతు సభ్యులు ఉండాలన్న నిబంధన ఉందనీ, అయితే టీడీపీ మినహా సభలో మరో పార్టీకి ప్రతిపక్ష హోదా అర్హత లేకపోవడంతో .. అధికారపార్టీ తరువాత సంఖ్యలో సభ్యులు వున్నా పార్టీకి ఆ హోదా దక్కుతుందని అంటున్నారు. ఇదే నిజమైతే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా మిగులుతుంది. లేని పక్షంలో పాతికేళ్ల తర్వాత చంద్రబాబు ఏ హోదా లేకుండానే కేవలం ఒక సాధారణ ఎంఎల్ఏ గానే అసెంబ్లీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?
- ఇరు పార్టీలు సంయమనం పాటించండి.. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ
కొద్దికాలం క్రితం వైసీపీకి మద్దతు ఇచ్చిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్, తనకు తగిన ప్రాధాన్యత దక్కకపోవడంతో తిరిగి టీడీపీ వైపు వచ్చేస్తారని ప్రచారం జరుగుతోంది. అది తేలేలోపే టీడీపీ నుంచి మరో వికెట్ పడిపోయే పరిస్థితి ఏర్పడింది. అసలే వరుస ఓటములతో కుదేలవుతున్న టీడీపీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజీనామా వ్యవహారం కలకలం రేపింది. బుచ్చయ్య చౌదరి రాజీనామాకు సిద్ధమైనట్లు వార్తలు వెలువడగానే టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఫోన్లో ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేయగా.. మరికొందరు నాయకులు నేరుగా కలిసి సంయమనం పాటించాల్సిందిగా కోరినట్టు తెలుస్తోంది.
అయినప్పటికీ గోరంట్ల తన పంతం వీడనట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే పార్టీలో అవమానాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఇప్పుడు రాజీనామా విషయంలో వెనకడుగు వేస్తే.. ఇంటాబయటా మరింత చులకనవుతారని ఆయన వర్గీయులు చెబుతున్నట్లుగా సమాచారం. రాజీనామాపై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరిగిందని, ఇప్పుడు వెనక్కి తగ్గితే పరువు పోతుందని వారు గోరంట్లకు తెలిపినట్లుగా సమాచారం. ఇలాంటి తరుణంలో గోరంట్ల వ్యవహారం ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.
More Latest telugu news today, Online telugu news today, Political news, online news today
2 thoughts on “Gorantla Butchaiah Chowdary | ఆగస్టు సంక్షోభం.. ప్రమాదంలో చంద్రబాబు ప్రతిపక్ష హోదా !”