టిడిపి సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మరోసారి నారా లోకేష్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన వచ్చే ఎన్నికల్లో మళ్లీ చంద్రబాబు నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాలని అభిప్రాయపడ్డారు. ఇపుడున్న పరిస్థితుల దృష్ట్యా లోకేష్ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లడం అంత మంచిది కాదన్నారు.
ఏపీ సీఎం జగన్ కు హ్యాట్సాఫ్ చెప్పిన తమిళ హీరో విశాల్
అలాగే టీడీపీ నుంచి పవన్ కళ్యాణ్ దూరంగా జరగడానికి గల కారణం కూడా లోకేష్ అని అన్నారు. టిడిపిలో నారా లోకేష్ యాక్టివ్ కారణంగానే పవన్ కళ్యాణ్ దూరం జరిగాయని చెప్పారు. గోరంట్ల వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే తాను నారా లోకేష్ నాయకత్వం పై అంత నమ్మకంగా లేదనే అభిప్రాయం కనబడుతుంది. మరోవైపు టిడిపి లో ఉన్న కొందరు లీడర్లు లోకేష్ ని, చంద్రబాబుని ఆకాశానికెత్తి పార్టీ కొంప ముంచుతున్నారని అన్నారు.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?
- ఇరు పార్టీలు సంయమనం పాటించండి.. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ
కాగా చంద్రబాబు నాయుడు తోపాటు ఎల్లో మీడియా అధిపతులు మాత్రం నారా లోకేష్ ను సీఎంను చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలు ఇందుకు విరుద్ధంగా ఉండటం ఆ పార్టీకి మింగుడుపడని అంశం అంటున్నారు పరిశీలకులు. ఇక టీడీపీకి చెందిన కొంతమంది వైఖరి కారణంగానే 2019లో పార్టీ ఓడిపోయింది అన్న బుచ్చయ్య.. 2024లో గెలవడానికి భారీ ప్రణాళిక చేస్తే తప్ప విజయం సాధించలేము అని అన్నారు. అందుకోసం ఇప్పటి నుంచే ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలన్నారు.
తాను ఆస్తులు పోగొట్టుకొని, ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా తెలుగుదేశం పార్టీ కోసం పని చేశానన్న బుచ్చయ్య.. పార్టీలో ఎవరికైనా ఆత్మగౌరవం ముఖ్యమని అన్నారు. ఎన్టీఆర్ వల్లనే తనకు టీడీపీలో ప్రాధాన్యత పెరిగిందని.. అప్పట్లో ఉన్న గౌరవం ఇప్పట్లో లేకనే అధినేతకు లేఖ రాసానని అన్నారు. బుచ్చయ్య చౌదరి వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి.
1 thought on “లోకేశ్ నాయకత్వం పై గోరంట్ల బుచ్చయ్య చౌదరి అసహనం..!”