గూగుల్ అకౌంట్ లో అందుబాటులో వున్న గూగుల్ ఫోటో (Google Photos) అపరిమిత స్టోరేజ్ సర్వీస్ జూన్ 1 తో ముగియనుంది. మరో రెండు రోజులే సమయం ఉన్నందున వారి పాత జ్ఞాపకాలను కోల్పోతామేమోనని వినియోగదారుల్లో భయం పట్టుకుంది. మీరు నిరభ్యంతరంగా మీ ఫొటోస్ ని భద్రం గ నిల్వ చేసుకోవచ్చు. ఈ క్రమంలో చాల మంది Google ఫోటోల storage ప్రత్యామ్నాయాల కోసం వెతకడం మొదలు పెట్టారు కూడా. అయితే మీ ఫోటోల కోసం ఇలాంటి క్లౌడ్ స్టోరేజ్ అందించే ప్లాన్స్ ఏవైనా ఉన్నాయా లేక Google కే చెల్లించి తిరిగి సేవలను కొనసాగించడం మంచిదా ఒకసారి చూద్దాం.
ఇప్పుడున్న గూగుల్ ఫోటోలు క్లౌడ్ స్టోరేజీ మనకున్న ఫోటోలను, వీడియోలను నిల్వచేయడమే కాకుండా .. ఫోటోలను ఎడిట్ చేయడం, స్లైడ్ షోస్ క్రియేట్ చేయడం లాంటి ఫీచర్స్ కలిగి వుంది. నిజం చెప్పాలంటే గూగుల్ ఫోటోలలోని అన్ని ఫీచర్స్ గనుక వినియోగదారులు ఒకసారి ప్రయత్నించి చూస్తే దీనికి వేరే ప్రత్యామ్నాయం లేదు అని భావిస్తారు. అయినా కూడా తమ మీడియాను ఆన్‌లైన్‌లో బ్యాకప్ చేయడానికి, స్టోర్ చేసుకోవడానికి ఉన్న మరికొన్ని పాపులర్ సర్వీస్ లను చూద్దాం.
Microsoft OneDrive – మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్
మైక్రోసాఫ్ట్ సర్వీసెస్ కు సంబంధించిన మైక్రోసాఫ్ట్ వన్‌డ్రైవ్ కూడా గూగుల్ ఫోటోలకు ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఇది మన ఫోటోల్లను స్టోర్ చేసుకోవడమే కాకుండా ఆటోమేటిక్ ఇమేజ్ ట్యాగింగ్ అనే ఆప్షన్ ను కలిగివుంటుంది. ఇది 5GB వరకు ఫ్రీ స్టోరేజ్ అందిస్తుంది. ప్రీమియం సదుపాయాలూ కూడా అందుబాటులో వున్నాయి. సంవత్సరానికి రూ .6,199 చెల్లిస్తే ఫ్యామిలీ ప్యాకేజీ కింద 100GB వరకు స్టోరేజ్ అందిస్తున్నారు.
Amazon Photos – అమెజాన్ ఫోటోలు
మంచి రెజల్యూషన్ ఫోటోలను స్టోర్ చేసువడానికి అమెజాన్ ఫోటోలు ఒక మంచి వేదిక. ఇందులో ఐదుగురు కుటుంబ భాగస్వామ్యంతో ఏర్పడిన వినియోగదారులనకు అన్ లిమిటెడ్ స్టోరేజ్ కి అవకాశమిస్తుంది. దీనిలో కూడా ఫొటోస్ ఎడిటింగ్ ,షేరింగ్ వంటి ఫీచర్ వున్నాయి. అమెజాన్ ప్రైమ్ మరియు నాన్ అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఉచిత స్టోరేజ్ కింద 5GB కవరకు అనుమతిస్తారు.
Apple Photos – ఆపిల్ ఫోటోలు
గూగుల్ ఫోటోలకు మరో ప్రత్యామ్నాయం ఆపిల్ ఫోటోలు. ఇది శక్తివంతమైన AI లక్షణాలు మరియు విస్తృత శ్రేణి ఎడిటింగ్ సాధనాలను అందిస్తుంది. ఇది కూడా 5GB స్టోరేజ్ వరకు పరిమిత సేవలను అందిస్తుంది. కానీ ఇది ఆపిల్ వినియోగదారులకు మాత్రమే పరిమితమైంది. ఎందుకంటే ఆపిల్ సర్వీస్ విండోస్ మరియు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌లలో పనిచేయదు.
Dropbox – డ్రాప్‌బాక్స్
ఫొటోస్ మాత్రమే కాదు అన్ని రకాల ఫైల్స్ ను కూడా స్టోర్ చేసుకువడానికి డ్రాప్‌బాక్స్ ఒక మంచి క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫాం అని చెప్పవచ్చు. 2GB వరకు మాత్రమే ఉచిత సేవలను అందిస్తున్న డ్రాప్‌బాక్స్.. క్రాస్-ప్లాట్‌ఫాం పద్దతిలో ఫోటోలు మరి అన్ని రకాల ఫైల్స్ ను బదిలీ చేయు లక్షణాలను కలిగివుంది. ఇందులో ప్రీమియం సేవలు కొంచెం ఖరీదు అనే చెప్పవచ్చు. ప్రారంభ ధర నెలకు సుమారు రూ.720 వరకు ఉండవచ్చు.
వినియోగదారులు తమకు నచ్చిన క్లౌడ్ స్టోరేజ్ ప్లాట్‌ఫాంలను ఎంచుకుని నిరభ్యంతరంగా తమ ఫోటోలను మరియు మీడియా ఫైల్స్ ని స్టోర్ చేసుకోవచ్చు
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …
2 thoughts on “Google Photos | గూగుల్ ఫొటోస్ కి ప్రత్యామ్నాయం వుందా.. జూన్ 1 ఆఖరు తేదీ .. !”