గూగుల్‌లో కొత్త ఫీచర్ ‘వర్చువల్ పీపుల్ కార్డు’లు

Google

గూగుల్ సెర్చి ఇంజిన్ తాజాగా పీపుల్ కార్డ్స్‌ పేరిట కొత్త ఫీచర్‌ ప్రవేశపెట్టింది. ఆన్‌లైన్‌ మరియు వెబ్సైటు అవసరాలకు వర్చువల్ విజిటింగ్ కార్డులను రూపొందించుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది.

దీన్ని మొదటిసారిగా భారత్‌లోనే ప్రవేశపెట్టినట్లు గూగుల్ సెర్చ్ ప్రోడక్ట్ మేనేజర్ తెలిపారు. కోట్ల సంఖ్యలో వ్యక్తులు, వ్యాపారవేత్తలు, ఉద్యోగార్థులు, స్వయం ఉపాది పొందుతున్నవారు, ఫ్రీలాన్సర్లు మొదలైన వారందరికీ ఇది ఉపయోగపడగలదని ఆమె వివరించారు.
దీని ద్వారా సరైన సమాచారం ఇవ్వడం ముఖ్య ఉద్దేశంగా చెప్పారు. ప్రస్తుతానికి ఇది మొబైల్‌లో మాత్రమే సపోర్ట్ చేస్తోంది.

దీని కోసం గూగుల్‌ సెర్చి్లో ‘యాడ్‌ మీ టు సెర్చ్’ అని టైప్ చేయాలి. ఆ తర్వాత యాడ్ యువర్‌సెల్ఫ్ టు గూగుల్ సెర్చ్ అనే పేజి వస్తుంది.
అందులో గెట్ స్టార్టెడ్ ఆప్షన్ ఎంచుకుని వెబ్‌సైట్ అడ్రెస్‌, సోషల్ నెట్‌వర్క్ ప్రొఫైల్స్, ఈ-మెయిల్ ఐడీ, ఫోన్‌ నంబరు తదితర వివరాలను పొందుపర్చి సేవ్ చేయాల్సి ఉంటుంది.
తద్వారా వర్చువల్ కార్డు సిద్ధమవుతుంది. ఆన్‌లైన్‌లో దీన్నే విజిటింగ్ కార్డుగా ఉపయోగించవచ్చని గూగుల్ తెలిపింది.

Leave a Comment