శ్రీకృష్ణ జన్మస్థానంపై మధుర కోర్టు సంచలన తీర్పు

హిందువులు తమ ఉక్కు సంకల్పంతో బాబ్రీ అయోధ్య వివాదాన్ని పరిష్కరించుకున్నారు. దశాబ్దాల పాటు న్యాయ పోరాటం చేసి ఘన విజయం సాధించారు. దీంతో రామయ్య జన్మస్థలంలో రామ మందిరం ఆవిష్కృతం కాబోతోంది. మందిర నిర్మాణ పనులు కూడా చకచకా సాగిపోతున్నాయి.

రామయ్య గుడి సాకారమైంది సరే .. మరి కృష్ణయ్య సంగతేమిటి..? శ్రీకృష్ణ జన్మస్థానమైన మధురలో అక్రమ నిర్మాణాల మాటేమిటి..? ప్రతి హిందువు మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. అయితే శ్రీకృష్ణ జన్మస్థానం విషయంలోనూ హిందువులు చల్లని వార్త వినే రోజు దగ్గర్లోనే ఉంది. ప్రస్తుత పరిణామాలు అందుకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి.

మధుర సివిల్ కోర్టు తాజాగా సంచలన తీర్పు వెలువరించింది. మధురలో షాహీ ఈద్గా మసీదు మేనేజ్మెంట్ కమిటీకి నోటీసులు జారీ చేసింది. టెంపుల్ కాంప్లెక్స్ లోని మసీదు తొలగింపు పై అభిప్రాయం చెప్పాలంటూ ఆదేశించింది.

కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేశంలోని వేలకొద్దీ ప్రముఖ దేవాలయాలను మొఘల్స్ నేలమట్టం చేశారు. వాటి స్థానంలో అక్రమంగా మసీదులు నిర్మించారు. వారణాసిలోని కాశీ విశ్వనాథ్ మందిరాన్ని జ్ఞానవాపి మసీదుగా మార్చేశారు. అలాగే మధురలోని కేశవనాధ్ దేవాలయాన్ని ధ్వంసం చేసి షాహీ ఈద్గా మసీదును నిర్మించారు.

ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని వేల కొద్ది ప్రముఖ దేవాలయాలు చరిత్రలో కలిసిపోయాయి. వాటి పునరుద్ధరణ దిశగా హిందువులు శతాబ్దాలుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగా శ్రీకృష్ణ జన్మస్థానాన్ని అక్రమంగా ఆక్రమించి నిర్మించిన అక్రమ కట్టడాలపైనా పోరాటం చేస్తున్నారు.

శ్రీకృష్ణ జన్మస్థానంలో అక్రమంగా నిర్మించిన మసీదును తొలగించాలంటూ మధుర శ్రీకృష్ణ జన్మస్థానం పూజారి పవన్ కుమార్ శాస్త్రి ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. ఈద్గా మసీదుతో పాటుగా మధురలో కాట్రాగ్ కేశవ్ దేవ్ టెంపుల్ కు చెందిన 13.7 ఎకరాల భూమిని శ్రీకృష్ణ జన్మస్థానానికే చెందుతుందని.. దశాబ్దాలుగా తమ పూర్వీకులు భగవంతున్ని కొలుస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు.

దేవాలయానికి నిజమైన సేవకులం తామేనని.. మొత్తం టెంపుల్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యతను తమకు అప్పగించాలని పిటిషన్లో పేర్కొన్నారు. అంతే కాదు దేవాలయం పక్కనే మసీదును కూడా నిర్మించుకునేలా 1967లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవ సంస్థాన్, షాహీ ఈద్గా మసీదు మేనేజ్మెంట్ కమిటీకి మధ్య కుదిరిన ఒప్పందాన్ని కూడా రద్దు చేయాలని కోరారు.

అక్రమ మసీదును తొలగించేలా లక్నోలోని సున్నీ వక్ఫ్ బోర్డు అధ్యక్షుడు షాహీ ఈద్గా మసీదు మేనేజ్మెంట్ కమిటీని ఆదేశించాలని పూజారి శాస్త్రి తన పిటిషన్లో పేర్కొన్నారు. శాస్త్రి పిటిషన్ పై విచారణ చేపట్టిన మధుర హైకోర్టు ఈమేరకు సంచలన తీర్పు వెలువరించింది. మసీదు కూల్చివేత పై అభిప్రాయం చెప్పాలంటూ ఆదేశించింది.

Leave a Comment