సముద్రంలో 30 కి.మీ. 13 గంటలు | Goli Syamala

Goli Syamala : తెలంగాణ వెటరన్ స్విమ్మర్ గోలి శ్యామల ఒక అరుదైన రికార్డు సృష్టించారు. 47 సం. వయసు కలిగిన శ్యామల బంగాళాఖాతంలోని పాక్ జలసంధిలో ఏకధాటిగా 13 గంటల 43 నిమిషాల పాటు స్విమ్మింగ్ చేశారు. శ్రీలంక తీరంలో తన సాహసాన్ని ప్రారంభించిన శ్యామల 30 కి.మీ. పాటు స్విమ్ చేసి రామేశ్వరంలోని ధనుష్కోడికి చేరుకున్నారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన రెండో మహిళగా , తొలి తెలుగు మహిళగా ఈ ఘనత సాధించారు. మహిళలు ఏదైనా సాధించగలరని తన విజయం నిరూపించిందని శ్యామల పేర్కొన్నారు.

Leave a Comment