దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాకనే ఏపీలో గంజాయి సరఫరా, స్మగ్లింగ్ మొదలైందని ఇటీవల చంద్రబాబు నాయుడు, టిడిపి నేతలు, ఒక వర్గం మీడియా ప్రచారం చేస్తోంది. చంద్రబాబు ఏకంగా ఢిల్లీ వెళ్లి ఏపీ డ్రగ్స్ కు కేంద్రంగా మారిందని.. ఏపీలో యూత్ అంతా డ్రగ్స్ కు బానిసలు అవుతున్నారంటూ కేంద్రం పెద్దలకు ఫిర్యాదు చేశారు.

అయితే కాస్త లేటుగా అయినా టీడీపీకి దిమ్మతిరిగే విషయాలను వైసీపీ వెలుగులోకి తెచ్చింది. వైసిపి విడుదల చేసిన వీడియోలను చూస్తే జగన్ ప్రభుత్వం పై తాను చేస్తున్న ఆరోపణలను చంద్రబాబు బుకాయించడం తప్ప సమర్థించుకోవడం కష్టమే. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మంత్రి హోదాలో గంటా శ్రీనివాస్, చింతకాయల అయ్యన్నపాత్రుడు గంజాయి సరఫరా పై చేసిన వ్యాఖ్యలు వైసీపీ ఎంపీ భారత్ మీడియా సమావేశంలో ప్రదర్శించారు. ( బోండా ఉమాపై అందుకే కేసు నమోదు చేయలేదేమో.. ! )

గంజాయి సరఫరా చేస్తున్న క్రెడిట్ మనకే దక్కిందన్న చంద్రబాబు

టిడిపి హయాంలో మంత్రి హోదాలో మాట్లాడిన గంటా శ్రీనివాస్.. దేశం మొత్తానికి విశాఖ నుంచే గంజాయి సరఫరా అవుతోంది అన్నది బహిరంగ రహస్యమని అంగీకరించారు. క్యాబినెట్ సమావేశంలో చంద్రబాబు కూడా విశాఖ నుంచే దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేస్తున్న క్రెడిట్ మనకే దక్కుతుంది అంటూ జోక్ చేశారు అని కూడా గంటా వివరించారు.

జనసేన పార్టీ అధ్యక్షుడిని వెంటాడుతున్న నవతరం పార్టీ

ఒకప్పుడు కేజీల్లో గంజాయి దొరికేదని, ఇప్పుడు మాత్రం టన్నుల కొద్ది గంజాయి బయటపడుతుందని టిడిపి హయాంలోని పరిస్థితినే గంటా ఆరోజు వివరించారు. దీనివెనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళ హస్తం ఉందని కూడా మంత్రి హోదాలో గంటా వ్యాఖ్యానించారు. చివరకు స్కూల్ బస్సులో కూడా గంజాయి తరలిస్తున్నారంటూ నాడు ఆవేదనచెందారు.

మరో మంత్రి అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ దేశంలోని ప్రధాన పట్టణాలకు గంజాయి విశాఖనుంచే రవాణా అవుతోంది అని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో గంటా చెప్పినట్లు టన్నులకొద్దీ గంజాయి పట్టుబడినా అప్పుడు మాత్రం దేశం మొత్తానికి మనమే గంజాయి సరఫరా చేస్తున్నామంటూ చాలా సింపుల్ గా జోకేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మాత్రం రాష్ట్రం అల్లకల్లోలం అవుతోందన్నట్టు ప్రచారం చేయడం విచిత్రంగానే వుంది. గంటా శ్రీనివాస్, అయ్యన్నపాత్రుడు మంత్రి హోదాలోనే గంజాయి స్మగ్లింగ్ వెనుక పెద్ద పెద్ద వాళ్ళు వున్నారని చెప్పారంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు అని వైసిపి ఎంపీ భరత్ చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ( నారా లోకేష్ పై హత్యాయత్నం కేసు )

చంద్రబాబు అసాంఘిక శక్తులకు రారాజుగా మారి ఏపీలోని యువత మొత్తం గంజాయికి, డ్రగ్స్ కు బానిస అయ్యారంటూ ఢిల్లీలో ప్రచారం చేస్తున్నారని ఆక్షేపెంచారు. పచ్చి అబద్దాలు చెప్పి రాష్ట్రపతిని తప్పుదోవ పట్టించిన చంద్రబాబు నాయుడును అండమాన్ జైలుకు పంపించాలన్నారు. జగన్ ప్రభుత్వాన్ని అల్లరిపాలు చేయడానికి చంద్రబాబు ఏ అంశాన్ని భుజాన వేసుకున్న ఆఖరికి అది బెడిసి కొడుతూనే వుంది. ఇప్పుడు డ్రగ్స్ వ్యవహారం కూడా తిరిగి చంద్రబాబు వైపే భూమరాంగ్ అయ్యేలా ఉంది.

1 thought on “దేశం మొత్తానికి గంజాయి సరఫరా చేసిన క్రెడిట్ మాదే.. గంటా శ్రీనివాస్”

Leave a Comment