గన్నవరంలో వారిద్దరూ ఒక్కటయ్యారా..!!

ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఎవరైనా ఒకరు ఒక అడుగు ముందుకు వేసి ఆ సమస్యను పరిష్కరించాల్సి ఉంటుంది. ఇక్కడ ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చొరవ తీసుకొని ఇద్దరి మధ్య సమస్య పరిష్కారానికి ముగింపు పలికారట. ఇంతకీ ఆ పరిష్కారమేమిటో చూద్దాం..

ఆంధ్రప్రదేశ్ లోని నియోజకవర్గాలలో కృష్ణా జిల్లాలోని గన్నవరం నియోజకవర్గం ఒకటి అన్న సంగతి అందరికి తెలిసిందే. ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన వల్లభనేని వంశీ కొద్ది నెలల క్రితం ఆ పార్టీని వీడి జగన్ కు జై కొట్టిన విషయం కూడా తెలుసు. అయితే ఆయన వైసీపీలోకి రావడంతో, అదే నియోజకవర్గానికి చెందిన వైసీపీ నాయకులు ఎర్లగడ్డ వెంకటరావు,దుట్టా రామచంద్రరావు కలత చెందారు. అంతేకాకుండా వల్లభనేని వంశీ కి వ్యతిరేకంగా ప్రత్యేక వర్గాలు కూడా మొదలయ్యాయి.

గన్నవరం వైసిపి లో నెలకొన్న వర్గపోరుకు చెక్ పెట్టేందుకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రయత్నం చేశారని తెలుస్తోంది. నియోజకవర్గ పరిధిలోని పునాదిపాడు జగనన్న విద్యా కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన ప్రత్యర్థి ఎర్లగడ్డ వెంకట్రావు ఇద్దరినీ కలిపేందుకు జగన్ ప్రయత్నించారు. ఆ విజువల్స్ కూడా నేడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో వంశీ చేతిలో ఎర్లగడ్డ వెంకట్రావు 700 ఓట్లతో ఆయన ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూ వస్తుంది. సరిగ్గా అలాంటి తరుణంలో టిడిపి నుంచి గెలిచిన వంశీని, జిల్లా మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సహాయంతో వైసీపీలోకి తీసుకువచ్చారు. జగన్ ను కలిసిన తర్వాత టిడిపి పై నిప్పులు చెరుగుతూ ప్రభుత్వానికి అండగా వంశీ నిలబడుతున్నారు. మరో ప్రత్యర్థి రామచంద్ర రావు వర్గాన్ని ఆయన దూరం పెడుతున్నారు. దీంతో ఈ ముగ్గురి మధ్య మూడుముక్కలాట కొనసాగుతూ వస్తుంది.

ఈ నేపథ్యంలో గన్నవరం లోని పునాదిపాడు పాఠశాలకు విద్యా కానుక ప్రారంభోత్సవానికి జగన్ హాజరయ్యారు. వంశీ, ఎర్లగడ్డ ఇద్దరినీ కూడా పలకరించారు. ఇద్దరికి పరస్పరం షేక్ హ్యాండ్ ఇప్పించారట ముఖ్యమంత్రి జగన్. విభేదాలు వీడి పార్టీ కోసం పని చేయాలని కూడా ఈ సందర్భంగా కోరినట్టు తెలుస్తోంది. జగన్ సమక్షంలోనే వల్లభనేని వంశీ, ఎర్లగడ్డ షేక్ హ్యాండ్ చేయడంతో కార్యకర్తలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారట.

ముఖ్యమంత్రి దెబ్బకు ఇద్దరు ఒకటయ్యారు అంటున్నారట. అయితే ఈ కార్యక్రమంలో రామచంద్రరావు మాత్రం అస్సలు కనిపించలేదు. ఏదైనా కార్యక్రమాలలో బిజీగా ఉండడంతో ఆయన రాలేకపోయారేమో కానీ ఆయన కూడా వీరితో కలవక తప్పదు.

Leave a Comment