వినాయకుడు అంటే గణాలన్నింటినీ ఏకతాటిపై నడిపించేవాడు. ప్రథమ పూజ్యుడు. సత్య ప్రమాణాల దేవుడు. వినాయకుడు అంటే విశేషమైన నాయకత్వ లక్షణాలు కలిగిన వాడు. ప్రకృతి ప్రేమికుడు. వ్యక్తిత్వ వికాస నిపుణుడు. గెలవాలన్న సంకల్పం ఉంటే సాధించలేనిది ఏమీ లేదని.. స్వీయ లోపాలను గుర్తిస్తే కుశాగ్ర బుద్దితో దానిని అధిగమించవచ్చు అని నిరూపించాడు. విఘ్నాలు తొలగెందుకు ఆయనను అర్చించడంతో పాటుగా.. ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణంలోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది.
విఘ్నాలు తొలగించేవాడు వినాయకుడు
గజాణుడిని ప్రణవనాధ స్వరూపుడిగా.. శబ్దబ్రహ్మ ఆకృతిగా ఉద్గల పురాణం.. లోక రక్షకుడుగా గణేశ పురాణం.. సమస్త లోకానికి ఆధార శక్తిగా గణేష్ గీత చెబుతున్నాయి. దేవతల నుంచి మానవుల వరకు ఎదుర్కొనే విఘ్నాలను, ప్రతికూల శక్తులను నిలువరించి, వారు చేపట్టే కార్యాలు విజయతీరాలకు చేరేందుకు ఆయన కృప ఉపకరిస్తుందని.. అందుకు ఎన్నో పురాణగాథలు ఉదాహరణలుగా ఉన్నాయి.
కేంద్ర ఏజెన్సీలు అన్నీ చూస్తున్నాయి..తస్మాత్ జాగ్రత్త..!!
శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పది అని చాటిన వ్యక్తిత్వ వికాస నిపుణుడు వినాయకుడు. బలాన్ని, బలహీనతలను ఎరిగి ప్రవర్తించాలని ఆయన చర్య చాటి చెబుతుంది. గణాధిపత్యం కోసం అన్నదమ్ములు వినాయకుడు, కుమారస్వామి పోటీపడినప్పుడు.. ముల్లోకాల్లోని పుణ్యనదులలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ పదవి దక్కుతుంది అని తండ్రి పరమేశ్వరుడు నిబంధన విధించాడు.
దానికి స్థూలకాయుడైన గణేశుడు మొదట కలత చెందాడు. శక్తివంతుడు, వేగంగా ప్రయాణించగల తమ్ముడిని అధిగమించలేనని భావించాడు. అంతలోనే బుద్ధిబలాన్ని ప్రయోగించాడు. కన్నవారే కనిపించే దైవం అని.. ప్రకృతి పురుషులైన తల్లిదండ్రులకు ప్రదర్శనలతో సర్వ పుణ్య నదీస్నానం ఫలితం దక్కుతుందని గ్రహించి ఆచరించాడు. తమ్ముడు వెళ్లిన చోట ప్రతీ నదిలో ఆయన స్థానం ఆడుతూ కనిపించాడు. గణాధిపతిగా నియమితుడై, సర్వ సమర్దుడిగా మన్ననలను అందుకున్నాడు. ( మూఢ విశ్వాసంతో సజీవంగా సమాధిలోకి )
కుశాగ్ర బుద్ధి కలవాడు వినాయకుడు
శ్రీరామచంద్రుడు లంకకు సేతుబంధన సమయంలో వినాయకుడు మార్గదర్శనం చేశాడని.. వారధి నిర్మాణంలో ఇంజనీర్ లా సూచనలు చేశారని చెబుతారు. కుశాగ్ర బుద్ధి కలవాడు కనుకే.. మహాభారత రచనలో వ్యాసభగవానుడు రాయసకారుడిగా ప్రతిభను ప్రదర్శించాడు. తాను చెబుతున్నప్పుడు తన వేగాన్ని అందిపుచ్చుకుంటూ.. తాను చెప్పేది అర్థం చేసుకున్న తర్వాతే వ్రాయాలి అన్న వ్యాసుడి నిబంధనను అంగీకరించాడు.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదిక
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలు
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?
ప్రకృతి దేవుడు, ప్రకృతిని భగవత్స్వరూపంగా భావించి ఆరాధించడం వినాయక వ్రత విధానంగా చెబుతారు. వినాయకుడు రూపుదాల్చింది వర్ష ఋతువులోనే. ఈ కాలంలో ప్రకృతి ఆకులు, పూలతో హరితమయంగా ఉంటుంది. ముఖ్యంగా ఔషధీ గుణాలు గల 21 రకాల పత్రిలతో పూజిస్తారు. వీటి ద్వారా అనేక వ్యాధులను నివారించవచ్చు అని ప్రకృతి వైద్యం చెబుతోంది. వీటిలోని గరిక శ్రేష్టమైనది. ఇది చర్మ వ్యాధులను నివారిస్తుంది. స్వామి నామావళితో దీన్ని ప్రత్యేకంగా అర్చిస్తారు.
బీజేపీ సరికొత్త వ్యూహం.. బెంగాల్ విభజన రాగం..!
నిరాడంబరతను నేర్పే వేలుపు వినాయకుడు. విలువైన నగలు, ఆభరణాలు కోరడు. ప్రకృతిలో లభించే పత్రాలను స్వీకరించి, భక్తితో అర్చిస్తే సంతోష పడతాడు. పార్వతీదేవి మంగళ స్నానం సమయంలో ఆమె శరీరం నలుగుపిండి ద్వారా వినాయకుడు రూపుదాల్చినట్లుగా శివపురాణం చెబుతున్నందున ఆయన పృథ్వీ తత్వానికి ప్రతిబింబం. పాంచభౌతికమైన శరీరంలో మూలాధారాన్ని పృథ్వితత్వంతో మేళవిస్తారు. మూలాధార తత్వానికి అధినాయకుడు వినాయకుడు. అందుకే మట్టి వినాయకుడిని పూజించడం వల్ల సత్వర ఫలితం చేకూరుతుందని పురాణవచనం.
కొండంత దేవుడికి కొండంత పూజా ద్రవ్యాలు, కానుకలు సమర్పించలేమన్నట్లుగా.. ఉన్నంతలో భక్తిప్రపత్తులతో మనస్ఫూర్తిగా ఆరాధించేలా వృత్తికా విగ్రహం ఉంటుంది. దానిని పూజిస్తే కొండంత కష్టాన్ని గోటితో తొలగిస్తాడని భక్తుల విశ్వాసం. ఇక హిందూ ధర్మంలోని వివిధ వర్గాల మధ్య సుహృద్భావం, జాతీయభావాలు పెంపునకు గణపతి నవరాత్రి ఉత్సవాలు తోడ్పడతాయి అన్న భావనతో వీర శివాజీ ఘనంగా, బహిరంగంగా ఈ ఉత్సవాల నిర్వహణకు శ్రీకారం చుట్టారు. ఆయన తర్వాత వాటికి కొంత ఆటంకం కలిగినా.. స్వరాజ్య సమరం సమయంలో నేతలు దానిని అందిపుచ్చుకున్నారు.
- మా బాబుగారు సింహంలా ఢిల్లీ వస్తే ఎవరూ పట్టించుకోరే.. !
- పాకిస్తాన్ లో తాలిబన్ జెండాలు.. ఉలిక్కిపడ్డ ఇమ్రాన్ ఖాన్
- పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ రాజీనామా..!
- చైనా గుప్పెట్లోకి శ్రీలంక దీవులు..భారత్ కు ముప్పు పొంచిఉందా ..?
బాలగంగాధర్ తిలక్ గణపతి నవరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. అప్పటివరకు ఇళ్లకే పరిమితమైన ఈ పూజలు, ఆయన ఆధ్వర్యంలో సామూహిక ఉత్సవంగా రూపుదిద్దుకుంది. అలా మైదానాలలో, కూడళ్లలో విగ్రహాలు ప్రతిష్టించి, పూజలు నిర్వహించి, నిమజ్జనం చేసే ఆనవాయితీ ఒకటి నేటికీ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా గణపతి ఆరాధన ఉన్నా.. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తెలుగు రాష్ట్రాల్లో మరింత ఘనంగా జరుపుకుంటారు. తమిళనాడులో ఇది రెండు రోజుల పండుగ కాగా.. ఇతర ప్రాంతాల్లో తొమ్మిది రోజుల పండుగ.