టిడిపి నేత ఫ్యూజన్ ఫుడ్ యజమాని హర్షవర్ధన్ కు విశాఖ అధికారులు షాక్ ఇచ్చారు. విశాఖ సిరిపురంలో ఫ్యూజన్ ఫుడ్ ఆధ్వర్యంలో నడుస్తున్న రెస్టారెంట్ను ఖాళీ చేయించారు. నిబంధనలకు విరుద్ధంగా లీజు గడువు పెంచుకొని విశాఖ నగరాభివృద్ధి సంస్థకు నష్టం చేకూర్చినట్లు అధికారులు గుర్తించారు. దాంతో ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు.
లీజు గడువు ముగిసినా రెస్టారెంట్ ఖాళీ చేయకపోవడంతో ఉదయం అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని రెస్టారెంట్ లోని సామాగ్రిని మొత్తం వాన్లోకి ఎక్కించి తరలించారు. సిరిపురంలోని రెస్టారెంట్ లీజును నిబంధనలకు విరుద్ధంగా టిడిపి పెద్దల సాయంతో గతంలో పొడిగించినట్లు చాలాకాలంగా ఆరోపణలు ఉన్నాయి.
నిబంధనలు ఒప్పుకోవని గతంలో అధికారులు చెప్పినా.. టిడిపి పెద్దలు చేసిన ఒత్తిడి కారణంగా అప్పట్లో అధికారులు తలొగ్గారు. ఇప్పుడు ఉన్నతాధికారుల నుంచి మద్దతు లభించడంతో ఆస్తిని తిరిగి VUDA స్వాధీనం చేసుకుంది. గతంలోనూ సరిగా లీజును చెల్లించకపోవడంతో ఖాళీ చేయించేందుకు అధికారులు ప్రయత్నించారు.
అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో టిడిపి పెద్దలు జోక్యం చేసుకున్నారు. ఖాళీ చేయించడం అటుంచి ఏకంగా 2024 వరకు తొమ్మిదేళ్లపాటు లీజును పెంచేలా విశాఖ నగరాభివృద్ధి సంస్థ పై ఒత్తిడి తెచ్చారు. ఈ హర్ష వర్ధనే విశాఖ ఎయిర్ పోర్ట్ లోని ఫ్యూజన్ ఫుడ్ రెస్టారెంట్లు కూడా నిర్వహిస్తున్నారు.
వైసిపి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పై ఎయిర్పోర్టులో హత్యాయత్నానికి అవకాశం ఇచ్చింది ఈ రెస్టారెంటే అన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ పై దాడి చేసిన శ్రీనివాసులును చేరదీసింది.. రెస్టారెంట్లో పని కల్పించింది హర్ష వర్ధనే. ఈయన అప్పట్లో టిడిపిలో చురుగ్గా ఉండేవారు.
విశాఖ జిల్లా గాజువాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు టిడిపి తరఫున రెండు సార్లు ప్రయత్నించారు. టిడిపి పెద్దలు ఎయిర్ పోర్ట్ కు వస్తే ఇక్కడి నుండే ఫుడ్డు అందించేవారు. సిరిపురం లోని రెస్టారెంట్లు ఖాళీ చేస్తున్నారని తెలియగానే టిడిపి నేతలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఈ ప్రభుత్వం కక్ష సాధింపుకు పాల్పడుతోందని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘించి ఉంటే కోర్టుకు వెళ్లాలి కానీ నేరుగా వచ్చి బలవంతంగా ఖాళీ చేయించడం సరైంది కాదని టిడిపి నేతలు మీడియా వద్ద ప్రశ్నించారు. హర్ష వర్ధన్ కూడా తనకు ఎలాంటి నోటీసు ఇవ్వలేదని కనీస సమాచారం కూడా ఇవ్వకుండా బలవంతంగా ఖాళీ చేయించారని హర్షవర్ధన్ ఆరోపిస్తున్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …