పార్టీ నేతలకు తలనొప్పిగా మారిన టీఆర్ఎస్ విజయ గర్జన సభ.. అసలు జరుగుతుందా..?

  • విజయ గర్జన సభకు మా భూములు ఇవ్వం అంటున్న రైతులు

టీఆర్ఎస్ విజయ గర్జన సభ : టిఆర్ఎస్ పార్టీ పై అప్పుడే ప్రజా వ్యతిరేకత మొదలైందా..! హుజురాబాద్ ఉప ఎన్నిక ఓటమి, టీఆర్ఎస్ పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా చెబుతోందా..! వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ విజయ గర్జన సభ పేరుతో నిర్వహించ తలపెట్టిన సభకు భూములు ఇవ్వమంటూ ఎదురు తిరుగుతున్న రైతులు అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారా..! టీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు ఇస్తూ తెలంగాణ రాష్ట్రంలో మారుతున్న పరిణామాలు సీఎం కేసీఆర్ కు తలనొప్పిగా మారుతున్నాయా..! అంటే అవుననే సమాధానమే వస్తోంది.

నా తడాఖా చూపిస్తా ..! కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీతో ఢీ కొట్టే పార్టీ లేదని.. టీఆర్ఎస్ పార్టీ నుండి కుక్కని నిలబెట్టినా గెలిచి తీరుతుంది అని తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు, టీఆర్ఎస్ పార్టీ నేతలు నిన్నమొన్నటివరకూ చాలా ధీమా వ్యక్తం చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక వచ్చిన నేపథ్యంలో ఎలాగైనా హుజురాబాద్ లో గులాబీ జెండా ఎగరేసి మరోమారు తెలంగాణ రాష్ట్రంలో తమ సత్తా చూపించుకోవాలని భావించారు.

అయితే హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలు సంచలన తీర్పుతో ఈటల రాజేందర్ ను గెలిపించారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి మంత్రాలు తమ వద్ద పని చేయవని తేల్చి చెప్పారు. ఇక ఈ షాక్ నుండి టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికీ కోలేకపోయింది. ఇదే సమయంలో టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లాలో నిర్వహించ తలపెట్టిన విజయ్ గర్జన సభ పార్టీ నేతలకు పెద్ద తలనొప్పిగా తయారైంది.

విజయ గర్జన సభకు ఆదిలోనే అవాంతరాలు

హుజరాబాద్ ఉప ఎన్నిక ఓటమితో సభ నిర్వహించాలా.. వద్దా అన్న మీమాంస ఒకటైతే.. సభ నిర్వహించకపోతే ప్రతిపక్షాలకు టార్గెట్ అవుతామన్న ఆందోళన మరొకటి. ఏది ఏమైనా ఫైనల్గా సభ నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం పార్టీ నేతలను టెన్షన్ పెడుతోంది. 29వ తేదీన టిఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువగర్జన సభకు ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి.

టిఆర్ఎస్ పార్టీ ఈ సభను మొదట ఈ నెల 15వ తేదీన నిర్వహించాలని భావించినా.. ఈనెల 29వ తేదీన దీక్షా దివస్ సందర్భంగా నిర్వహించడానికి తేదీని మార్చారు. తెలంగాణ రాష్ట్ర సమితి 20 ఏళ్ళ పండుగ సందర్భంగా వరంగల్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా విజయ గర్జన సభను నిర్వహించాలని భావిస్తున్నట్లు టిఆర్ఎస్ పార్టీ నేతలకు అడుగడుగున రైతులు షాక్ ఇస్తున్నారు.

తెలుగుదేశం పార్టీ రాజకీయాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫైర్..!

హనుమకొండ జిల్లా దేవన్నపేటలో నవంబర్ 29వ తేదీన సభ నిర్వహించడానికి స్థలాన్ని సేకరిస్తున్న క్రమంలో మరోమారు రైతులు ఆందోళనకు దిగారు. టిఆర్ఎస్ పార్టీ నేతలతో గొడవ పెట్టుకున్నారు. మీ రాజకీయాల కోసం తమ పంటలను నాశనం చేసుకోవాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని, మళ్లీ తమ పొలాల వైపు చుడద్దంటూ ధర్నాకు దిగారు. రైతుల ఆందోళనలతో అధికారులు వెనుదిరిగి వెళ్లిపోయారు.

సభకు భూమి ఇవ్వాలని అధికారులు, టిఆర్ఎస్ పార్టీ నేతలు తమపై ఒత్తిడి తెస్తున్నారని.. సభకు భూమి ఇవ్వకపోతే ధరణి పోర్టల్ నుంచి భూముల వివరాలు లేకుండా చేస్తామని బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీ భూమిని వేరే వారి పేరు మీద చేస్తామని కొందరు టిఆర్ఎస్ నేతలు బెదిరింపులకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.

టిఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా పది లక్షల మందితో నిర్వహించాలనుకుంటున్న విజయ గర్జన సభకు స్థల సేకరణ ప్రధాన సమస్యగా మారడం పార్టీ నేతలకు తలనొప్పిగా తయారైంది. అతను సభ జరుగుతుందా అన్న అనుమానం కలుగుతుంది. మొన్నటికి మొన్న స్థల పరిశీలన కోసం వెళ్ళిన మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్యే ఆలూరి రమేష్ లతో పాటుగా టిఆర్ఎస్ పార్టీ నేతలను రైతులు అడ్డుకుని బహిరంగ సభకు భూములు ఇవ్వబోమని ఆందోళన చేశారు.

Leave a Comment