భారీ అగ్ని ప్రమాదం.. ఏడుగురు మృతి..

Fire 1

విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ లో ఆదివారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దీనిని కోవిడ్ కేర్ సెంటర్ గా వినియోగిస్తున్నారు.
ఈ ప్రమాదంలో ఏడుగురు మృతిచెందారు.మరికొంతమంది గాయాల పాలయ్యారు. ప్యాలెస్ లో ఉదయం షార్ట్ సర్క్యూట్ వలన బిల్డింగ్ మొత్తం దట్టమైన పొగలు,మంటలతో నిండిపోయింది.
ఇందులో 30 నుండి 40 మంది వరకు కోవిడ్ పేషంట్స్ తో పాటు ఇతర హోటల్ మరియు వైద్య సిబ్బంది ఉన్నట్టు సమాచారం.
ప్రమాద సమయంలో ప్రాణాలు కాపాడుకోవడానికి కొందరు కిటికీ నుండి దూకారు. కొందరు పారిపోయారు. కొందరు ఊపిరిఆడక చనిపోయారు.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపుచేశారు కానీ అది కోవిడ్ సెంటర్ కావడం వల్ల లోపలి వెళ్ళడానికి సాహసించలేక పోయారు.
అందువలన కొందరు ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనపై సీఎం జగన్ తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. తన ఆదేశాల మేరకు మంత్రి వెల్లంపల్లి ప్రమాద స్థలానికి చేరుకొని తాజా పరిస్థితిని అధికారులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం సరైన సమయంలో స్పందించిందని,ఎక్కువ ప్రాణ నష్టం జరగకుండా అరికట్టామని తెలిపారు. ఈ ప్రమాదం ప్యాలెస్ మేనేజిమెంట్ యొక్క అజాగ్రత్తల వలన సంభవించినట్టు ప్రాధమికంగా నిర్ధారించారు.
అలాగే భాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


కోవిడ్ నివారణ చర్యల్లో భాగంగా సమీపంలోని రమేష్ హాస్పిటల్ లోని పేషంట్స్ ని ఈ స్వర్ణ ప్యాలెస్ ను కోవిడ్ కేర్ సెంటర్ గా మార్చి సేవలు అందిస్తున్నారు.
ఇందులో కనీస ఫైర్ సేఫ్టీ లేకపోవడం వలన ఇంత భారీ అగ్ని ప్రమాదం సంభవించిందని అధికారులు అంటున్నారు.
బాధితులకు సరైన వైద్యం అందించి మరణించిన వారి కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a Comment