రానున్న ఏడాదికి సంబంధించిన ఎన్నికలపై తమిళనాడు రాజకీయ పార్టీలు అప్పుడే కసరత్తు ప్రారంభించాయి. ముఖ్యంగా అన్నాడిఎంకెలో గత కొద్ది రోజులుగా ఉన్న అంతర్గత వివాదాలు ఒక కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే పళనిస్వామి,పన్నీర్ సెల్వం ల మధ్య మొన్నటి వరకు నువ్వా నేనా అనే పంథాలో రగడ జరిగింది. వాటికి స్వస్తి పలికి ఇరువురు ఇప్పుడు చేతులు కలిపారు. పార్టీ విజయమే పరమావధిగా కలిసి పని చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.
అన్నిటికంటే ముఖ్యమైన అంశం అయినటువంటి సీఎం అభ్యర్థి విషయంలో కూడా ఒక క్లారిటీకి వచ్చారు. అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిగా ప్రస్తుత సీఎం పళనిస్వామి పేరును పన్నీర్ సెల్వమే ప్రకటించారు. 2021 ఎన్నికల కోసం 11 మంది సభ్యులతో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేశారు. 2016 డిసెంబర్లో అప్పటి సీఎం జయలలిత అనారోగ్యంతో కన్నుమూశారు.
జయలలిత మరణంతో అన్నాడీఎంకే రెండుగా చీలిపోయింది. పన్నీర్ సెల్వం వెర్సెస్ పళనిస్వామి వర్గాలుగా విడిపోయింది. అనంతరం కొన్ని నెలల పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేశారు పన్నీర్ సెల్వం. అనంతరం ఆ తర్వాత నెలకొన్న రాజకీయ పరిణామాలతో పన్నీర్ సెల్వం సీఎం బాధ్యతల నుంచి తప్పుకున్నారు. సీఎంగా పళనిస్వామి పగ్గాలు చేపట్టారు. కొన్నాళ్లపాటు ఇరువురి మధ్య విభేదాలు కొనసాగాయి. ఆ తర్వాత రెండు వర్గాలూ కలవడంతో శుభం కార్డు పడింది. సీఎం గా పళని, డిప్యూటీ సీఎంగా పన్నీర్ కొనసాగుతూ వచ్చారు.
అయితే వచ్చే సంవత్సరం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఇరువురి మధ్య అభిప్రాయభేదాలు వచ్చాయి. వచ్చే ఎన్నికల్లో తాను సీఎంగా ఉంటారని పన్నీర్ చెప్పడంతో అందుకు పళనిస్వామి అంగీకరించలేదు. కొన్ని రోజులుగా ఈ విషయమై పార్టీలో రచ్చ జరిగింది. ఎట్టకేలకు తాజాగా జరిగిన చర్చలు ఇరువురి మధ్య సయోధ్య కుదరడంతో సీఎం అభ్యర్థి అంశంపై వివాదం సద్దుమణిగింది. పళనిస్వామిని సీఎం అభ్యర్థిగా స్వయంగా పన్నీర్ సెల్వం ప్రకటించారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా ఎవరు ఉంటారని దానిపై కమిటీని ఏర్పాటు చేశారు.
పళని సీఎం అభ్యర్థిగా ఉన్న నేపథ్యంలో పన్నీర్ ను పార్టీ అధ్యక్షుడుగా ఎన్నుకునే అవకాశం ఉంది. ఇక తమిళనాడులో 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా 2016 లో జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి 125 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. డీఎంకే నుంచి 97 మంది విజయం సాధించారు. అయితే జయలలిత మరణం తర్వాత అన్నడిఎంకెలో పెరిగిన వర్గ విభేదాలు, ప్రభుత్వం వ్యతిరేకతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని డీఎంకె భావిస్తోంది.
వివాదాలకు తెర పడినట్లేనా
వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే వ్యూహంతో ముందుకు వెళ్తోంది. ఈ నేపథ్యంలో డీఎంకే వ్యూహాలు ఎంత వరకు పనిచేస్తాయి అన్నది కూడా ఆసక్తికరంగా మారింది. అయితే అన్నాడిఎంకెలో వివాదాలకు శుభం కార్డు పడినప్పటికీ.. మళ్లీ ఏదైనా అంతర్గత కుమ్ములాటలు జరిగితే అది పార్టీ గెలుపు పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందనేది రాజకీయ విశ్లేషకుల మాట. ఎన్నికల టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎటువంటి పరిణామాలు చోటుచేసుకుంటాయో చూడాలి మరి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …