కరోనా మన దేశంలోకి ప్రవేశించినప్పటినుండి జ్వరం అనగానే జనం వణికిపోతున్నారు. ఏ జ్వరం వచ్చినా అది కరోనా ఏమో అన్న భయం అందరిలో వుంది. ఈ భయం వల్ల సాధారణంగానే చికిత్స సమయంలో బాధితులకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది.
సాధారణంగా వర్షాకాలంలో రకరకాల జ్వరాలు వస్తుంటాయి. వీటన్నిటినీ కరోనా అని ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఈ సమయంలో ఎలాంటి జ్వరాలు వస్తాయి,వీటికి ఎక్కడ చికిత్స పొందవచ్చనే విషయం తెలుసుకుంటే అనవసర ఆందోళన నుంచి బయటపడొచ్చని వైద్యులు చెబుతున్నారు.( రోజుకు 4వేల టెస్టులు)
కరోనా
మోస్తరు జ్వరం, దగ్గు, గొంతు బాగా తడారటం, ఒళ్లు నొప్పులు, నీరసం కనిపిస్తాయి. ఆర్టీపీసీఆర్ టెస్టు ద్వారా దీనిని గుర్తించవచ్చు.
జ్వర నియంత్రణకు పారాసెట్మాల్, దగ్గు తగ్గేందుకు అజిత్రోమైసిన్ వేసుకోవాలి.
టైఫాయిడ్
ఈ జ్వరం కలుషితమైన నీరు,ఆహారం ద్వారా వస్తుంది. తీవ్ర జ్వరం, కడుపు నొప్పి, అజీర్తి లక్షణాలు కనిపిస్తాయి.
ఈ జ్వరాన్ని వైడల్ టెస్టుద్వారా గుర్తించవచ్చు. ఈ టెస్టులు అన్ని పీహెచ్‌సీల్లో చేస్తారు.
డెంగీ జ్వరం
ఇది దోమకాటు వల్ల వస్తుంది. హై ఫీవర్, తలనొప్పి, కనుగుడ్ల వెనుక నొప్పి, కండరాలు పట్టేసినట్టు ఉండటం, శరీరంపై దద్దుర్లు కనిపిస్తాయి.
ఈ జ్వరాన్ని ఐజీఎం టెస్టుతో గుర్తించవచ్చు. టెస్టులు అన్ని జిల్లా ఆస్పత్రుల్లో చేస్తారు. పీహెచ్‌సీలు మొదలుకొని అన్ని ఆస్పత్రుల్లోనూ మందులు లభిస్తాయి
జ్వరంతో పాటు చలి ఉంటే మలేరియా. జ్వరంతో పాటు ఆయాసం ఉంటే కరోనా అనుకోవాలి. మరి ఏ ఇతర లక్షణాలు వున్నా వెంటనే టెస్టులు చేయించు కోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.
- పెరుగుతున్న డెంగ్యూ కేసులు.. ప్రత్యేక బృందాలను పంపిన కేంద్రండెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తొమ్మిది రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు దేశ …
- Corona third wave intensity seems to be low in india | CSIRCorona third wave intensity : The CSIR (Council of Scientific …
- చైనాలో మొదలైన కరోనా డెల్టా వేరియంట్.. అన్ని డోర్స్ లాక్ ..!కరోనా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతూ నేడు ప్రమాదకర కరోనా డెల్టా వేరియంట్ …
- కరోనా మూడవ వేవ్ పిల్లలను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని రాష్ట్రాలు జాగ్రత్త పడుతున్నాయా ?ముందు జాగ్రత్తగా ఉత్తర ప్రదేశ్ లో పిల్లలకు మెడిసిన్ కిట్లు పంపిణీ ప్రారంభం. …
- మంకీపాక్స్ రూపంలో మరో ముప్పు పొంచి వుందా.. ?కరోనా మూడో వేవ్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అని వార్తలు వినిపిస్తున్న …