మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి(75) మంగళవారం ఉదయం మరణించారు. రెండు సంవత్సరాల నుంచి ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. వార్డు సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కిష్టారెడ్డి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుడిగా ఒకసారి, సర్పంచ్‌గా రెండుసార్లు, ఎంపీపీగా ఒకసారి, ఎమ్మెల్యేగా రెండుసార్లు విజయం సాధించారు. మొదటిసారి ఇండిపెండెంట్‌గా ఎమ్మెల్యే ఎన్నికల్లో రంగంలోకి దిగిన ఎడ్మ విజయం సాధించారు. నియోజకవర్గంలో ఆయనకు చాలా మంచి పేరుంది. ఎంతో సౌమ్యుడిగా పేరు పొందడం పాటు ప్రజలందరికీ తలలో నాలుకలా పనిచేశారు. అందుకే ఆయన ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగినా అక్కడ ఓటర్లు ఆయనకు పట్టం గట్టారు.
రెండోసారి ఆయన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యే స్థానానికి బరిలోకి దిగినా అక్కడి ఓటర్లు మళ్లీ ఆయనకే పట్టం గట్టారు. తర్వాత కాలంలో మళ్లీ ఆయన కాంగ్రెస్ నుంచే పోటీచేసి పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత వైస్ రాజశేఖర్‌రెడ్డి మరణించడంతో జగన్ ఏర్పాటు చేసిన వైసీపీలోకి మారారు. ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా సమర్ధవంతంగా పనిచేశారు. కార్యకర్తలకు ఎప్పుడూ అండగా ఉండేవారు. పార్టీని బలోపేతం చేసే దిశగా ఆయన అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న కాలంలోనే మహబూబ్‌నగర్ జిల్లాలో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయురాలు, వైఎస్ జగన్ సోదరి షర్మిలతో పాదయాత్రను నిర్వహించారు. ఈ పాదయాత్రను విజయవంతం చేయడంలో ఆయన పాత్ర ఎంతో కీలకమైంది. అయితే, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎడ్మ వైసీపీ నుంచి టీఆర్‌ఎస్‌లోకి మారారు. ఆ ఎన్నికల్లో ఇప్పటి కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు సంపూర్ణ మద్దతునిచ్చారు. ఆయన విజయంలో కిష్టారెడ్డి కీలకంగా వ్యవహరించారు. అయితే, రెండేళ్ల క్రితం ఆయనకు ఊపిరితిత్తుల వ్యాధి సోకింది. దీంతో అప్పటినుంచి ఎడ్మ చికిత్స పొందుతున్నారు. చివరకు మంగళవారం ఉదయం ఆయన తుదిశ్వాస విడిచారు. ఎడ్మ మృతితో మహబూబ్‌నగర్ జిల్లా అంతటా విషాద ఛాయలు అలుముకున్నాయి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …