మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉత్తరాంధ్ర సీనియర్ నేత పెనుమత్స సాంబశివరాజు (89) కన్నుమూశారు.
కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
సాంబశివరాజు సర్పంచ్ స్థాయి నుంచి మంత్రి వరకు రాజకీయంగా ఎదిగారు. ఎనిమిది సార్లు ఎమ్మెల్యే, ఒకసారి మంత్రి, ఏఐసీసీ కార్యదర్శిగా సాంబశివరాజు పనిచేశారు.
శాసనసభలో రెండుసార్లు ప్రొటెమ్ స్వీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. గజపతినగరం, సతివాడ స్థానాల నుంచి వరుసగా 8 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.
1968లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. సుదీర్ఘ కాలంపాటు కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన రాజకీయ కురువృద్ధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఆపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి, అందులోనే కొనసాగారు. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు సంతాపం తెలిపారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …