వ్యూహాత్మక రహదారుల ప్రారంభంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టనున్న భారత్.. !

సరిహద్దు ప్రాంతాల విషయంలో భారత ప్రభుత్వం ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ముందుకు వెళుతోంది. సరిహద్దు దేశాలు తోక జాడిస్తున్న సమయంలో సైన్యాన్ని వీలైనంత త్వరగా తీసుకొని వెళ్ళడానికి రోడ్డు మార్గాల విషయంలో ప్రత్యేకమైన దృష్టి పెట్టింది భారత ప్రభుత్వం.

తాజాగా భారత్ 12 వ్యూహాత్మక రహదారులను ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్, లఢక్ సరిహద్దు ప్రాంతాలు అనుసంధానంగా ఉండేలా రహదారి మౌలిక సదుపాయాలు ముఖ్యమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు. గురువారం నాడు ఆయన 12 సరిహద్దు రహదారులను ప్రారంభించారు. ఈ రహదారులు వ్యూహాత్మక మరియు సామాజిక, ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ అన్నారు.

భద్రతే ప్రామాణికంగా

వీటి ద్వారా జాతీయ భద్రతను బలోపేతం చేయవచ్చని.. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రోత్సహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తారని ఆయన వెల్లడించారు. భారత సైనిక దళాల అవసరాలను తీర్చడంలోనూ .. మందులు, రేషన్ వంటి నిత్యావసరాలను మారుమూల ప్రాంతాలకు రవాణా చేయడానికి ఈ రహదారులు సహాయపడతాయని రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు.

రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ గత ఏడాది గాల్వాన్ వ్యాలీ ఘటన సందర్భంలో విధుల్లో మరణించిన 20 మంది సైనికులకు నివాళులు అర్పించారు. భారతదేశం శాంతి, ప్రేమగల దేశమని అయితే దురాక్రమణకు దాని ప్రతిస్పందన ధీటుగానే ఉంటుందని ఆయన హెచ్చరించారు.

ఈ సరిహద్దు రహదారి ప్రాజెక్టులు భారతదేశం యొక్క Act East Policy లో భాగమని.. ఇందులో భాగంగా సరిహద్దు ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామని రాజ్నాథ్ సింగ్ అన్నారు. అస్సాంలోని Lakhimpur జిల్లాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో వర్చ్యువల్ గా పాల్గొన్న రాజ్నాథ్ సింగ్, 20 కిలోమీటర్ల పొడవైన డబుల్ లేన్ కిమిన్ పోటిన్ రహదారితో పాటు, అరుణాచల్ ప్రదేశ్ లోని 9 రహదారులను.. లఢక్ – జమ్మూకాశ్మీర్లోని రహదారులను ప్రారంభించారు.

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ [ BRO ]

బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ [ BRO ] యొక్క ప్రోద్భలంతో ఈ రహదారులను ప్రారంభించినట్టు తెలిపారు. అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు .. కేంద్ర మంత్రులు మరియు రక్షణశాఖ చీఫ్ జనరల్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దేశంలోని మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ [ BRO ] చేసిన కృషిని రాజ్నాథ్ సింగ్ ప్రశంసించారు. ముఖ్యంగా covid -19 లాక్ డౌన్ సమయంలో కూడా BRO చాలా కష్టపడి రోడ్లను పూర్తి చేసిందని వెల్లడించారు.

1 thought on “వ్యూహాత్మక రహదారుల ప్రారంభంతో ప్రత్యర్థులకు చెక్ పెట్టనున్న భారత్.. !”

Leave a Comment