కరోనా యాంటీబాడీ డ్రగ్ కి DCGI అనుమతి..!

కరోనా నియంత్రణకు ఫార్మా కంపెనీలు తమ వంతుగా వాక్సిన్ లు కనిపెడుతూనే వున్నాయి. ఇందులో భాగంగా మరో ఔషధం అందుబాటులోకి వచ్చింది. డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ( DCGI ) COVID-19 చికిత్సకు ఉపయోగించే యాంటీబాడీ drugs ఔషధాల కలయికకు అత్యవసర వినియోగ అనుమతి కోసం అమెరికాకు చెందిన భారతదేశ విభాగం ఎలి లిల్లీ ( Eli Lilly ) అండ్ కంపెనీకి అనుమతి ఇచ్చింది. ఇది కరోనా బాధితులకు శుభవార్తే అని చెప్పవచ్చు. ( Corona second wave Bio-war )

మోనోక్లోనల్ యాంటీబాడీస్ బమ్లానివిమాబ్ 700ఎంజీ, ఎటెసెవిమాబ్ 1400ఎంజీ అనే ఔషధాలనకు కరోనా ఇన్ఫెక్షన్‌ సోకి మధ్యస్థ లేదా తీవ్రత కల్గిన రోగుల చికిత్సకు దీన్ని వినియోగించేందుకు డీసీజీఐ గ్రీనిసిగ్నల్ ఇచ్చింది. దీని ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచి త్వరలోనే పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తామని ఆ సంస్థ ఎండీ (ఇండియా విభాగం) ల్యూకా విసిని తెలిపారు.

Leave a Comment