బీజేపీలోకి ఈటెల రాజేందర్.. ?

మాజీ మంత్రి ఈటలకు బీజేపీ నేతలనుంచి ఆహ్వానం అందినట్టు తెలుస్తోంది. నిన్న రాత్రి కిషన్ రెడ్డితో ఈటెల రాజేందర్ భేటీ అయ్యారని సమాచారం. హైదరాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో బీజేపీ నేతలతో భేటీ అయినట్టు తెలుస్తోంది.

అంతే కాకుండా రెండు రోజుల క్రితం బీజేపీ నేతలు డీకే అరుణ,జితేందర్ రెడ్డి తో కూడా ఈటెల రాజేందర్ సమావేశమైనట్టు వార్తలు వచ్చాయి. బీజేపీ లోకి వస్తేనే బాగుంటుందని, కలిసి పోరాటం చేద్దామని ఈటెలకు చెప్పిన బీజేపీ నేతలు చెప్పినట్టు తెలుస్తోంది.

బీజేపీ లో చేరాలా వద్దా అన్న దానిపై ఈటెల తర్జన భర్జన పడుతున్నారు. ఈ విషయమై ఈటెల రాజేందర్ తన అనుచరులతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. చూడాలి .. ఈటెల రాజేందర్ రాజకీయ భవిష్యత్తు ఎటువైపు మలుపు తిరుగుతుందో.. !

Leave a Comment