7.2 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు..

జపాన్ లోని ఈశాన్య తీరంలో శనివారం సాయంత్రం 7.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ నేపథ్యంలో అక్కడి వాతావరణ సంస్థ సునామీ హెచ్చరికలు జారీ చేసింది.

ఆ ప్రాంత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 6.09 గంటలకు మియాగి ప్రాంతంలోని సముద్రంలో బలమైన భూకంపం సంభవించినట్లు పేర్కొంది. సముద్రంలో దాదాపు 60 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ విపత్తుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి వుంది.

Leave a Comment