నగరానికి మరో మణిహారం ..

హైదరాబాద్ నగరానికి మరో అత్యాధునిక నిర్మాణమైన దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి భాగ్యనగర ఖ్యాతిని మరింత ప్రకాశింపజేసేలా ఉంది. బ్రిడ్జి అందాలు నగరానికే ప్రత్యేక శోభను తీసుకువస్తున్నాయి. ఇది ఆసియాలోనే పెద్దదైన అద్భుతమైన కేబుల్ వంతెనగా గుర్తించబడింది. ఈ వంతెనను తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ ప్రజలకు అంకితం చేసింది.

రూ.184 కోట్ల వ్యయంతో దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిని కేంద్రమంత్రి జీ. కిషన్‌రెడ్డి తో కలిసి రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి తారక రామారావు ప్రారంభించారు. దీంతోపాటు దుర్గంచెరువులో బోటింగ్‌ను, కేబుల్ వంతెనకు అనుసంధానంగా జూబ్లీహిల్స్‌ రోడ్డు నంబర్‌ 45 నుంచి నిర్మించిన ఎలివేటర్ కారిడార్‌ను కూడా వారు ప్రారంభించారు. దీనికి ‘పెద్దమ్మతల్లి ఎక్స్‌ప్రెస్ వే’ గా నామకరణం చేశారు. ( భారత్ లో బైక్‌ అమ్మకాలు )

735.639 మీటర్ల పొడవు, 18 మీటర్ల వెడల్పుతో దుర్గం చెరువుపై నాలుగు లేన్లతో నిర్మించిన ఈ కేబుల్ వంతెనతో జూబ్లీహిల్స్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ మధ్య దూరంతోపాటు, ట్రాఫిక్‌ తగ్గనున్నట్లు మంత్రి తెలిపారు. అనంతరం మంత్రులు దుర్గంచెరువులో బోటింగ్‌ చేశారు. నేతలు, అధికారులతో కలిసి పడవలో ప్రయాణిస్తూ అందాలను తిలకించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేశ్ కుమార్‌తోపాటు మంత్రులు తలసాని,మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, సబితారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి తదితతరులు పాల్గొన్నారు.

Leave a Comment