దేశమంతటా ఇప్పుడు ఐపీఎల్ సీజనుతో సందడి నెలకొంది. క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఐపీఎల్ మ్యాచ్ లతో టీవీలకు,మొబైల్ ఫోన్లకు అతుక్కుపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీలోని క్రికెట్ ఫాన్స్ కు షాక్ తగిలింది. ఐపీఎల్ స్పాన్సర్ ‘డ్రీమ్ 11’పై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది.
‘ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్’లో భాగంగా ఇటీవల చేసిన కొన్ని సవరణల కారణంగా డ్రీమ్ 11 యూజర్లు పెయిడ్ కంటెస్ట్‌లో జాయిన్ అవలేకపోతున్నారు. ఇప్పటికే తెలంగాణ, అసోం, ఒడిశా, నాగాలాండ్, సిక్కింలోని రాష్ట్రాల్లో కూడా అన్ని రకాల ఆన్‌లైన్ గేమ్స్‌లో పే టూ ప్లే ఫార్మట్‌కు అనుమతించడం లేదని డ్రీమ్ 11 పేర్కొంది. యాప్‌ని ఓపెన్ చేసినప్పుడు ఈవిధమైన మెసేజ్ స్క్రీన్‌పై కనిపిస్తోంది.
మాములుగా అయితే డ్రీమ్ 11 యాప్‌లో ఉచితంగా కూడా ఫాంటసీ క్రికెట్ ఆడుకోవచ్చు. ఇప్పడు కేవలం డబ్బులు చెల్లించే కంటెస్ట్‌లపై మాత్రమే నిషేధం విధించింది. డ్రీమ్ 11పై ఈ ఆకస్మిక నిషేధం విధించడం వల్ల వ్యాలెట్ లో డబ్బులు ఉన్న వాళ్ళ పరిస్థితి గందరగోళంగా మారింది. (ఐపీల్ 2020 లీగ్ ప్రారంభం)
ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు. కొందరు మంచి పనయిందంటూ , మరికొంతమంది మాత్రం ఉన్నపళంగా ఇలా చేస్తే ఎలా..? అని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమ డబ్బులను ఎలా విత్ డ్రా చేసుకోవాలని ట్వీట్స్ పెడుతున్నారు.
వాలెట్ నుంచి నగదు ఉపసంహరణపై డ్రీమ్ 11 స్పందించింది. ”మీ డబ్బులు డ్రీమ్ 11 వాలెట్‌లో సేఫ్‌గా ఉంటాయి. వివరాల కోసం http://d11.co.in/HelpCenter లోకి వెళ్లి మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. మీ ఫిర్యాదును స్వీకరించి, డబ్బులను తిరిగి చెల్లిస్తాము.” అని కామెంట్ పెట్టింది.
కాగా, డ్రీమ్ 11 ఫాంటసీ క్రికెట్‌లో డబ్బులు పెట్టి ఆడటంపై ఇప్పటికే అసోం, ఒడిశా, తెలంగాణ, నాగాలాండ్ ప్రభుత్వాలు నిషేధం విధించాయి. తాజాగా ఈ జాబితాలోకి ఆంధ్రప్రదేశ్ వచ్చి చేరింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …