హెచ్ 1 బి వీసాలపై డొనాల్డ్ ట్రంప్ షాకింగ్ నిర్ణయం..

అమెరికాలో అధ్యక్ష పదవికి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ట్రంప్ (Trump) కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే కోవిడ్ ప్రభావంతో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను ఏ విధంగానైనా గాడిలో పెట్టేందుకు ట్రంపు మల్లగుల్లాలు పడుతున్నారు. దానికితోడు ప్రస్తుత తరుణంలో కోట్లాది అమెరికాలో ఉద్యోగాలు ఊడిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు విదేశీయులవలసలపై ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.

ఈ క్రమంలోనే అమెరికాలో ఉద్యోగాలు చేయాలని భావిస్తున్న భారత టెక్కీలపై మరోసారి దెబ్బ కొట్టారు ట్రంప్. అమెరికాలో ఉపాధి ఆధారిత హెచ్1బీ వీసాల పై డొనాల్ ట్రంప్ (Donald Trump) తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాకు చట్టబద్దమైన వలసలను అరికట్టదాంతో పాటుగా.. అమెరికా పౌరులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు హెచ్1బీ వీసాలను తక్కువ సంఖ్యలో మాత్రమే జారీ చేసేలా తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంతమందికి హెచ్1బీ వీసాలను ఇవ్వాలి, కనీస వేతనం ఎంత చెల్లించాలి అనే వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ, డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ అధికారులు వెల్లడించారు. అంతేకాదు కొన్ని హెచ్1బీ వీసాలకు సంబంధించి గత 20 ఏళ్లలో చేసిన అతి ముఖ్యమైన సంస్కరణ ఇది అని అమెరికా లేబర్ డిప్యూటీ సెక్రటరీ వెల్లడించారు. ఈ ఆంక్షలు త్వరలోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సాధారణంగా ప్రతి ఏడాది అమెరికా ప్రభుత్వం సుమారుగా 85 వేల హెచ్1బీ వీసాలను జారీ చేస్తోంది.

అయితే తాజా నియమావళి ప్రకారం ఆ సంఖ్యను పావువంతు తగినట్లుగా లేబర్ డిప్యూటీ సెక్రటరీ తెలిపారు. మూడవ వంతు దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయని వెల్లడించారు. ఏటా జారీ అయ్యే 85 వేల హెచ్1బీ వీసాలలో చైనా, భారతీయులే దాదాపుగా యాభై వేల మంది వీసాలు పొందుతూ ఉన్నారు. అయితే ఈ వీసాలను తగ్గించడంతో ఇరుదేశాల టెక్కీపై తీవ్ర ప్రభావం పడనుంది. కరోనా నేపథ్యంలో హెచ్ వన్ బీ వీసా జారీలను రద్దు చేస్తూ జూలైలో అధ్యక్షుడు ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

అమెరికన్ల స్థానంలో తక్కువ జీతాలకు విదేశీయులను నియమించే ఈ విధానాన్ని రద్దు చేయాలని ట్రంప్ అప్పట్లోనే పేర్కొన్నారు. కాగా హెచ్1బీ ప్రోగ్రాంను అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్ సమయంలో అమలు చేశారు. టెక్కీ రంగంలో ప్రత్యేకమైన ఉద్యోగాలు, క్వాలిఫైడ్ వర్కర్ల కోసం ఈ విధానాన్ని తీసుకొచ్చారు. అమెరికాలోని కంపెనీలో ప్రత్యేక పోస్టుల్లో విదేశీయులు తాత్కాలికంగా పని చేయాలంటే హెచ్1బీ నాన్ ఇమిగ్రెంట్ వీసా తీసుకోవడం తప్పనిసరి. ఐటీ, ఇంజనీరింగ్, సైన్స్, మెడిసిన్ లాంటి రంగాల్లో నిపుణులకు మాత్రమే హెచ్1బీ వీసాలను అమెరికా ప్రభుత్వం మంజూరు చేస్తూ వచ్చింది.

అక్కడి కంపెనీలు వర్క్ వీసాల్లాగా, హెచ్1బీ వీసాలను కూడా జారీ చేస్తుంది. భారత దేశం నుంచి అమెరికాకు వెళ్లిన వేలాది మంది ఉద్యోగులు హెచ్1బీ వీసాలతోనే ఉద్యోగం చేస్తున్నారు. డొనాల్ ట్రంప్ ఇప్పటికే ఏప్రిల్ లో ఇమ్మిగ్రేషన్ వీసాలపై నిషేధం విధించారు. EB 2, EB 3 ఈ కోవలోకే వస్తాయి. ఈ వీసాల ద్వారా గ్రీన్కార్డు పొంది అమెరికాలోనే శాశ్వత నివాస హోదా పొందాలనుకునే వారి ఆశలపై ట్రంప్ నీళ్లు చల్లారు. తాజాగా హెచ్1బీ వీసా జారీ విధానాన్ని కూడా సమీక్షిస్తూ భారత టెక్కీలకు ఊహించని షాక్ ఇచ్చారు ట్రంప్. అయితే ఈ విషయం ఎంత కాలం పాటు ఉంటుందన్న సమాచారం తెలియాల్సి ఉంది.

Leave a Comment