డిక్లరేషన్ వివాదం మరోసారి తెరమీదకి వచ్చింది. తిరుమలలో అన్య మతస్తులు డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని తాను అనని మాటలను అన్నట్లుగా కొన్ని మీడియా ఛానళ్లు, పత్రికలు తన వ్యాఖ్యలపై వివాదం చేస్తున్నాయని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఎల్లో మీడియా తీరును విమర్శించారు.
రోజూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా వివిధ మతాలకు చెందిన, వేలాది మంది భక్తులు వస్తూవుంటారు. వారందరినీ డిక్లరేషన్ తప్పనిసరిగా ఇవ్వాల్సిందేనని అడగలేము కదా? అని మాత్రమే తాను మాట్లాదినట్లు మరోసారి స్పష్టం చేశారు.
ఈ విషయంపై ఈరోజు శ్రీవారి ఆలయం ఎదుట శనివారం విలేకరులతో వైవీ సుబ్బారెడ్డి మాట్లాదారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి స్వామివారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వలేదని, అందువల్లే ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి డిక్లరేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. అంతేతప్ప తనకు వేరే ఉద్దేశం లేదని, డిక్లరేషన్ తీసేయాలని అనలేదని వివరణ ఇచ్చారు. తన వ్యాఖ్యలను వక్రీకరించి, బురదజల్లాలని చూస్తున్న ప్రతిపక్షం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైవీ సుబ్బారెడ్డి. తిరుమలలో టీటీడీ డిక్లరేషన్ వివాదంపై శనివారం ఈ మేరకు క్లారిటీ ఇచ్చారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగతున్న సమయంలో ఇటువంటి అనవసర వివాదాలు సృష్టించడం దురదృష్టకరమన్నారు.
టీటీడీ రూల్స్ ఏంచెప్తున్నాయి ..
టీటీడీ చట్టంలోని రూల్ 136 ప్రకారం హిందువులు మాత్రమే దర్శనానికి అర్హులు. ఇక స్వామివారి దర్శనం చేసుకోవాలనుకున్న ఇతర మతస్తులు మాత్రం తాము హిందూయేతరులమని దేవస్థానం అధికారులకు చెప్పి తమంతట తామే డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని రూల్:137లో స్పష్టంగా ఉంది. 2014లో ప్రభుత్వం జారీ చేసిన మెమో ప్రకారం ఎవరైనా గుర్తించదగిన ఆధారాలు ఉన్నవారైతే దేవస్థానం అధికారులే డిక్లరేషన్ అడుగుతారు. గతంలో అనేకమంది ఇతర మతాలకు చెందిన రాజకీయ, అధికార ప్రముఖులు స్వామివారి దర్శనానికి వచ్చిన సందర్భంలో డిక్లరేషన్ ఇవ్వలేదు.
సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాతే పాదయాత్రను ప్రారంభించి ,ఆ తర్వాత తిరుపతి నుంచి కాలినడకన వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్లారు. అదే విధంగా, పార్టీ అధికారంలోకి వచ్చాక స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాతే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనకు తిరుమల శ్రీవారి మీద మీద అపారమైన భక్తివిశ్వాసాలు ఉన్నాయని చెప్పడానికి ఇంతకంటే ఆధారాలు అవసరం లేదు. అందువల్లే ఆయన డిక్లరేషన్ ఇవ్వాల్సిన పనిలేదని చెప్పాను తప్ప డిక్లరేషన్ తీసేయాలని చెప్పలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి పునరుద్ఘాటించారు.
టీటీడీ ఆహ్వానం మేరకు ఈనెల 23న స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించేందుకు తిరుమలకు వస్తున్న సీఎం జగన్‌ను డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …