కొటియా గ్రామాలపై జగన్ మోహన్ రెడ్డి దూకుడు.. రంగంలోకి కేంద్రమంత్రి

ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య స్వాతంత్రం రాక ముందు నుండే కొటియా గ్రామాల వివాదం కొనసాగుతోంది. కొన్ని దశాబ్దాలు గడిచినా కూడా ఇరు రాష్ట్రాలు ఈ సమస్యను పరిష్కరించుకోలేక పోయాయి. ఈ సమస్య సుప్రీంకోర్టు వరకు వెళ్లినా కూడా.. ఇరు రాష్ట్రాలు కలిసి కూర్చొని, మాట్లాడి, చర్చించి, పరిష్కరించుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు కూడా ఈ విషయంలో చేతులెత్తేసింది.

ఇంతకు ముందు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా.. తెలుగుదేశం ప్రభుత్వం అయినా, ఒరిస్సాలో ఉన్నటువంటి ప్రభుత్వం తోటి సాన్నిహిత్యాన్ని కోరుకున్నాయి. అంటే అప్పుడు కాంగ్రెస్ కి నవీన్ పట్నాయక్ అవసరం ఉండేది.. అలాగే తెలుగుదేశం పార్టీ కూడా నవీన్ పట్నాయక్ తో సాన్నిహిత్యంగా ఉండేది. కాబట్టి ఎప్పుడు ఈ కొటియా గ్రామాల మీద దృష్టి పెట్టి.. అక్కడి సమస్యలు పరిష్కరించాలని చెప్పి వీళ్ళు ఎప్పుడూ ఆలోచించలేదు. ఏదైనా సమస్య వస్తే అప్పటికప్పుడు కూర్చుని, మాట్లాడుకొని తాత్కాలికంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేశారు గానీ దాని మీద సీరియస్ గా తీసుకున్న చర్యలేమీ లేవు.

కొటియా గ్రామాల అభివృద్ధి అప్పటినుంచే

అయితే జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి, తాను అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని లెక్కలు వేగంగా మారడం మొదలెట్టాయి. మొదట జగన్ మోహన్ రెడ్డి గారు అక్కడ గ్రహించింది ఏమిటంటే.. ఈ గ్రామాల మీద ఏపీ ప్రభుత్వానికి గానీ, ఒడిషా ప్రభుత్వానికి గానీ ఇద్దరికీ పట్టు లేదు అన్న విషయాన్ని తెలుసుకున్నారు. అంటే అక్కడ అభివృద్ధి లేదు. మౌలిక వసతులు లేవు. ఇవన్నీ తెలుసుకుని వెంటనే తన కార్యాచరణ మొదలుపెట్టారు. ( కాంగ్రెస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేసిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్)

ఏపీలో ఏవైతే నవరత్నాలు అమలు చేస్తున్నారో.. ఆ గ్రామాల్లో కూడా నవరత్నాలు అమలు చేయడం మొదలుపెట్టారు. మౌలిక వసతులకు సంభందించిన డెవెలప్మెంట్ చేయడం మొదలుపెట్టారు. విద్య, వైద్యంని ఇంప్రూవ్ చేయడం మొదలుపెట్టారు. అంతే కాకుండా అక్కడికి పోలీసులను పంపించాను. సాయుధ బలగాలను పంపించారు. నక్సల్స్ ఏరివేత కార్యక్రమానికి అక్కడ పూనుకున్నారు.

ఎప్పుడైతే ఇన్ని పనులు చేయడం మొదలెట్టారో.. ఒరిస్సా లో ఉన్నటువంటి నవీన్ పట్నాయక్ సర్కారు కూడా ఏమిచేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఒకానొక సందర్భంలో అక్కడికి పోలీసులను పంపించడం .. అఖిలపక్ష నాయకులను పంపించి అక్కడికి ఏపీ అధికారులను రానీయకుండా అడ్డుపడిన ఘటనలు వున్నాయి. అయినా కూడా జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అక్కడ పంచాయతీ ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు అన్ని జరిపించేసింది. ( గుజరాత్ లో బీజేపీ పట్టుకోల్పోతోందా .. ? )

చివరికి అక్కడి అఖిల పక్ష నాయకులు అందరూ ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని మూకుమ్మడిగా ఒక నిర్ణయానికి వచ్చారు. ఈ సమస్యను పరిష్కరించాలి అంటూ ఒరిస్సా కే చెందినటువంటి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దగ్గరికి అఖిలపక్షంతో వెళ్లారు. వెళ్లి మొరపెట్టుకున్నారట. “ఈ జగన్మోహన్రెడ్డి దూకుడు ఇలాగే గనుక కొనసాగితే .. మన కొటియా గ్రామాలూ ఏపీలో కలిసిపోతాయి. మీరే ఏదో ఒకటి చేయండి” అని.

దూకుడు ఆపమంటూ కేంద్రమంత్రి లేఖ

వెంటనే స్పందించిన ధర్మేంద్ర ప్రధాని గారు తాజాగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి మూడు పేజీల లేఖ రాశారు. అందులో వున్నా కీలక అంశాలు ఏమిటంటే.. కొటియా గ్రామాలపై మీ దూకుడు తగ్గించుకోండి. విద్యా ,వైద్య పరమైన నిర్ణయాలు తప్ప మిగిలిన ఎలాంటి నిర్ణయాలు ఆ గ్రామాల మీద మీరు తీసుకోకండి. అక్కడి నుండి పోలీసులు, సాయుధ బలగాలను వెనక్కి పిలిపించండి. ఒరిస్సా ప్రజాప్రతినిధుల మీద మీరు పెట్టిన కేసులను వెనక్కి తీసుకోండి. వీలైనంత త్వరగా మనిద్దరమూ కూర్చొని మాట్లాడుకుందాం. ఒక టైం ఫిక్స్ చేయండి. ఇద్దరం కూర్చుని, మాట్లాడి చర్చించుకుందాం. అప్పటివరకు కొంత మీ దూకుడు తగ్గించండి.. అని చెప్పి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి తాజాగా మూడు పేజీల లేఖ రాశారు. ( బీజేపీ సరికొత్త వ్యూహం.. బెంగాల్ విభజన రాగం..! )

ఇప్పటికే అక్కడి ప్రజలు జగన్ మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాలకు ఆకర్షితులై ఏపీలో కలవడానికి సిద్ధంగా ఉన్నారు. మెజారిటీ ప్రజల అభిప్రాయం అలాగే ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఎక్కడ ఈ గ్రామాల్లోని ప్రజలు చేజారిపోతారో అని చెప్పి ఒరిస్సా అఖిలపక్ష కమిటీ.. కేంద్ర మంత్రి అయితే రంగంలోకి దిగారు. ఈ నేపథ్యంలో జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ స్పందన ఎలా ఉంటది అన్నది చూడాలి.

1 thought on “కొటియా గ్రామాలపై జగన్ మోహన్ రెడ్డి దూకుడు.. రంగంలోకి కేంద్రమంత్రి”

Leave a Comment