కేంద్రమంత్రికి కరోనా..

Amith Corona

ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కరోనా బారిన పడగా మంగళవారం మరో కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఆయన చికిత్స నిమిత్తం గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. ధర్మేంద్ర ప్రధాన్ ప్రస్తుతం కేంద్రంలో పెట్రోలియం శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాకు కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరో కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కూడా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అమితాషాకు గత ఆదివారం కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. శనివారం సాయంత్రం తాను అమిత్‌షాను కలిశానని, ఈ నేపథ్యంలో వైద్యుల సలహాతో కుటుంబ సభ్యులకు దూరంగా సెల్ఫ్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు బాబుల్ ట్వీట్ చేశారు.

Leave a Comment