చైనాలో మొదలైన కరోనా డెల్టా వేరియంట్.. అన్ని డోర్స్ లాక్ ..!

కరోనా వైరస్ రకరకాలుగా రూపాంతరం చెందుతూ నేడు ప్రమాదకర కరోనా డెల్టా వేరియంట్ గా మారి వాక్సిన్ లను కూడా సవాలు చేస్తోంది. అన్ని దేశాల్లోనూ ఇది మెల్లమెల్లగా తీవ్రరూపం దాల్చే పరిస్థితులే కనిపిస్తున్నాయి. కోవిడ్ వైరస్ పుట్టినిల్లు చైనా కూడా ఇప్పుడు మరోమారు ఆ ప్రభావాన్ని ఎదుర్కొంటోంది. ( కరోనా మూడవ వేవ్ పిల్లలను ఎక్కువగా )

గత కొన్ని రోజులుగా అక్కడ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. దీంతో అప్రమత్తమైన చైనా ప్రభుత్వం వైరస్ వ్యాప్తి కట్టడికి కఠిన చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రజలు బయటకు రాకుండా ఉండేందుకు వారిని ఇంట్లోనే బందీలుగా చేసి.. అధికారులు బయటివైపు నుంచి తాళాలు వేసేస్తున్నారట. తలుపుల ముందు ఇనుప రాడ్లు పెట్టి మరీ ఇంటిని సీల్ చేసేస్తున్నారట. పీపీఈ కిట్లు ధరించిన కొందరు అధికారులు ఇళ్ల ముందు ఇనుప రాడ్లు కొడుతున్న వీడియోలు కొన్ని ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Doors locking in china due to delta variant explore

తాజాగా అక్కడ ఉన్న నిబంధనల ప్రకారం ఏ వ్యక్తి అయినా ఒక్క రోజులో మూడుసార్లు మాత్రమే బయటకు రావాలి. అంతకంటే ఎక్కువసార్లు బయటకొస్తే.. ఎక్కువ సార్లు తలుపులు తెరుచినట్టుగా ఫిర్యాదులు అందితే వెంటనే అధికారులు వారి ఇంటికి చేరుకుని బయట్నుంచి తాళాలు వేసేస్తున్నారట. అంతటితో ఆగకుండా డోర్ల ముందు ‘ X ‘ ఆకారంలో ఇనుప రాడ్లు బిగిస్తున్నట్టుగా వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Leave a Comment