టీడీపీ తరపున రాజ్యసభకు ఎన్నికై మొన్నటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయం తర్వాత బిజెపిలో చేరిన సుజనా చౌదరికి ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో చుక్కెదురైంది. ఆయన్ను విదేశాలకు వెళ్లకుండా ఢిల్లీ ఎయిర్పోర్టులో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు.
లుక్ అవుట్ నోటీసు ఉన్న నేపథ్యంలో మీరు విదేశాలకు వెళ్లడానికి వీల్లేదంటూ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. 2019 లోనే సుజనా చౌదరి పైన లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. పలు బ్యాంకుల నుంచి వందల కోట్ల రూపాయలు తీసుకుని ఆ నిధులను దారి మళ్లించారు.. బ్యాంకులను మోసం చేశారు అన్న వ్యవహారంలో సుజనా చౌదరిపై ఇప్పటికే సిబిఐ, ఈడీ కేసులు కూడా నమోదయ్యాయి.
ఈ కేసుల నేపథ్యంలో 2019లోనే సుజనా చౌదరిపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో అమెరికా వెళ్లేందుకు ఢిల్లీ ఎయిర్పోర్ట్ కు సుజనా చౌదరి వెళ్ళగా అక్కడ ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. లుక్ అవుట్ నోటీసులు ఉన్నాయి కాబట్టి అమెరికాకు వెళ్ళడానికి వీలు లేదని తేల్చి చెప్పారు. దాంతో సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు తనను అక్రమంగా అడ్డుకున్నారంటూ పిటిషన్ వేశారు. తనను విదేశాలకు వెళ్లకుండా, అడ్డుకోకుండా ఇమ్మిగ్రేషన్ అధికారులకు ఆదేశాలు ఇవ్వండి అంటూ తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరి పిటిషన్ వేశారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు దీని పైన ఒక నిర్ణయం తీసుకోవాల్సి వుంది.
మొత్తంమీద లుకౌట్ నోటీసు నేపద్యంలో బిజెపిలో ఉన్నప్పటికీ కూడా ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అమెరికాకు వెళ్ళకుండా అడ్డుకోవడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక తెలంగాణ హైకోర్టు దీనిపై ఎలాంటి ఉత్తర్వులు ఇస్తుంది అన్నది చూడాలి.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …