రక్షణ రంగంలో మరో ముందడుగు..

ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా మరో కీలక అడుగు పడింది. దీనికి భారత రక్షణరంగమే వేదికగా నిలిచింది. 10 లక్షల మల్టీ మోడ్ హ్యాండ్ గ్రనేడ్ ల సరఫరా కోసం రక్షణ మంత్రిత్వ శాఖ నాగపూర్ కు చెందిన ఓ ప్రైవేటు సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది.

దేశీయ ప్రైవేట్ సంస్థలతో కుదుర్చుకున్న మొట్టమొదటి ఒప్పందం ఇదే కావడం గమనార్హం. ఇటువంటి మందు గుండు ఉత్పత్తులను ప్రభుత్వ యాజమాన్యంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు (Ordinance Factory Board) పర్యవేక్షిస్తోంది.

రక్షణ రంగంలో భారత ప్రభుత్వం చేపట్టిన మేకిన్ ఇండియా చొరవకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తూ రక్షణ మంత్రిత్వ శాఖ Aquiciation Wing ఈరోజు m.s. economic explosion limited అలాగే సోలార్ గ్రూప్ నాగపూర్ తో ఒప్పందం కుదుర్చుకుంది. సుమారు 409 కోట్ల రూపాయల వ్యయంతో భారత సైన్యానికి 10లక్షల మల్టీ మోడ్ హ్యాండ్ గ్రనేడ్ లను సరఫరా చేయడానికి ఈ ఒప్పందం జరిగింది.

ఈ గ్రనేడ్ ను రెండో ప్రపంచ యుద్ధం పాత కాలపు హ్యాండ్ గ్రనేడ్ ల స్థానంలో భారత సైన్యం వాడనుండి. రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. మల్టీ మోడ్ హ్యాండ్ గ్రనేడ్ ను DRDO టెర్మినల్ రీసెర్చ్ లాబొరేటరీస్ రూపొందించగా, నాగపూర్లోని MSEEN చేత తయారు చేయించనుంది. ఈ గ్రనేడ్ లు విలక్షణమైన డిజైన్ను కలిగి ఉంటాయి. వీటిని అఫెన్సివ్ లేదా డిఫెన్సివ్ మోడ్లో ఉపయోగించుకోవచ్చు.

ఇది భారత ప్రభుత్వ డిఆర్డిఓ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రదర్శించే ఒక ప్రధానమైన ప్రాజెక్టు కాగా, ఆత్మ నిర్భర్ భారత్ కు ఇది అద్దం పట్టేలా ఉండనుంది. పూర్తి 100% దేశీయ ఉత్పత్తి జాబితాలో ఇది చేరనుంది. ఈ ప్రాజెక్ట్ 2011 నుంచి పెండింగ్లో ఉంది. అందుకు గల కారణం ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు చేత తయారు చేయబడిన ఈ గ్రనేడ్ ను డైరెక్టర్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్సు (DGQA) పెట్టిన క్వాలిటీ చెక్ లో ఫెయిల్ కావడమే.

ఎట్టకేలకు దీనిని డిఫన్స్ అక్విసియేషన్ కౌన్సిల్ 2019 మార్చ్ లో ఆమోదించింది. కాగా ఈ ఒప్పందాన్ని తాజాగా అధికారికంగా పట్టా లెక్కించడం జరిగిపోయింది.

Leave a Comment