వీరితోనే చాలా ప్రమాదం : CDFD

హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ తన తాజా సర్వేలో కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలను బయటపెట్టింది. కోవిడ్‌ లక్షణాలు కలిగి ఉన్నవారి కంటే… కోవిడ్ ఉండి ఏ లక్షణాలు లేని అసింప్టమేటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు 95 శాతం మందిలో 20 బి క్లేడ్‌ స్ట్రెయిట్‌ రకం వైరస్‌ ఉన్నట్లు తన సర్వే తేలిందని తెలిపింది.

హైదరాబాద్ సహా చుట్టుపక్క ప్రాంతాల్లో కోవిడ్‌ బారిన పడిన 210 మంది డేటాను మే మరియు జూన్‌ మాసాల్లో సేకరించింది. వీరిలో వైరస్‌లోడు ఎక్కువగా ఉన్నట్లు వారి విశ్లేషణలో ఈ విషయం స్పష్టమైందిని వివరించింది . కానీ, అదేస్థాయిలో వీరిలో ఇమ్యునిటీ లెవల్స్‌ అధికంగా ఉండటం వల్లే వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నారని స్పష్టం చేసింది. వీరి వలన ఇమ్యునిటీ లెవల్స్‌ తక్కువగా ఉన్న వారికి వైరస్‌ వ్యాపించడం, మరియు వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు గుర్తించింది. ( అమెరికాతో పోటీ పడుతున్న భారత్ ..? )

తాజా లెక్కల ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 57 వేల మంది వరకు వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 70 శాతం వరకు ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. కేవలం 30 శాతం మందిలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు గుర్తించారు. ఇలా లక్షణాలు లేని వారితోనే ప్రమాదమని, వీరి నుంచి వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్‌ విస్తరించి, పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు తేలింది.

Leave a Comment