అభిరామ్ కారుకు ప్రమాదం..!

Abitam

ప్రముఖ టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా తమ్ముడు అభిరామ్ కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అభిరామ్ తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. వివరాల్లోకి వెళితే…

కరీంనగర్ ఆరేపల్లికి చెందిన రాజు బ్రెజా కారు కొనడానికి నగరంలోని మణికొండ వెళ్లాడు. అక్కడ కారు ఓనర్ ను కలిసి టెస్ట్ డ్రైవ్ కోసం కారును తీసుకుని వెళ్లాడు. ఈ తరుణంలోనే పంచవటి కాలనీలో మల్లెమాల ప్రొడక్షన్ హౌస్ వద్ద పక్క రోడ్డులో అభిరామ్ బిఎండబ్ల్యూ కారు, బ్రెజా కారు ప్రమాదవశాత్తు ఒకదాన్ని మరొకటి ఢీకొన్నాయి.

ఈ రోడ్డుప్రమాదంలో రెండు కార్లు స్వల్పంగా దెబ్బతిన్నాయి. దీంతో రాజు, అభిరామ్ ఇద్దరూ రాయదుర్గం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇద్దరికి బ్రీత్ అనలైజర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్ష చేయగా, ఎవరూ మద్యం సేవించలేదని తెలిసింది. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Comment