కరెంటు చార్జీ రూ.. 1000 దాటితే ఇక ఆన్లైన్ లోనే ..

దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగదారుల హక్కులను తెలిపే నిబంధనలను కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. నాణ్యమైన విధ్యుత్ సరఫరా చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. సబ్సిడీలను నేరుగా లబ్ధిదారులకు అందించేందుకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ తీసుకువస్తోంది. వినియోగదారులు చెల్లించే నగదుకి వారికి వెంటనే సరిపడా విద్యుత్ అందేలా చర్యలు తీసుకోబోతోంది.

దీంతో రాష్ట్రాల్లో ఉన్న అన్ని డిస్కమ్ లు వినియోగదారులకు 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిందే.
ఇప్పటినుంచి విధ్యుత్ ఎంత డిమాండ్ ఉంది, ఎంత విద్యుత్ వాడుతున్నారు లాంటి పంపిణీకి సంబంధించిన అన్ని వివరాలు నమోదు చేస్తారు. వినియోగదారులకి అందిస్తున్న విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటే కచ్చితంగా మూల్యం చెల్లించాల్సిందే.

( హైదరాబాద్‌లోని రైస్ ఎటిఎం, (Rice ATM) 12,000 మందికి ఉచిత సాయం )

ఈ కొత్త విద్యుత్ నిబంధనల ప్రకారం కొత్తగా కనెక్షన్ తీసుకోవడం లేదా ఇంతకు ముందు ఉన్న కనెక్షన్లు మార్చుకోవడం వంటి సర్వీసులు సులువుగా జరగనున్నాయి. ఇక నుంచి రూ.1,000, అంతకంటే ఎక్కువ వచ్చిన బిల్లులను ఆన్ లైన్ లో మాత్రమే చెల్లించే విధానాన్ని తీసుకువస్తున్నారు.

Leave a Comment