కరోనా నిర్ధారణకు CT స్కాన్ తప్పదా .. !!

కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఒకటి antigen టెస్ట్ కాగా మరొకటి RTPCR . ఈ రెండింటిలో ఎక్కువ ఖచ్చితత్వం కలిగిన పరీక్ష RTPCR మాత్రమే అని డాక్టర్లు చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో antigen టెస్ట్ లో పాజిటివ్ లేదా నెగటివ్ వచ్చినా కూడా RTPCR పరీక్ష చేయించుకోవడమే ఉత్తమం అంటున్నారు. వీటినే పరిగణలోకి తీసుకోవాలని అంటున్నారు.

అయితే ఇప్పుడు కోవిడ్ వైరస్ కొత్త మ్యుటేషన్స్ తో విజృంభిస్తున్న పరిస్థితుల్లో RTPCR పరీక్ష సామర్థ్యంపైన అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం RTPCR టెస్టుల్లో నెగటివ్ రిపోర్ట్ వచ్చినా కూడా కోవిడ్-19 పాజిటివ్ గా నిర్ధారణ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుజరాత్ కు చెందిన డాక్టర్లు చెబుతున్నారు.

ఆ రాష్ట్రంలో RTPCR నెగటివ్ వచ్చినవారికి HRCT ( High Resolution City Scanning )లో వైరస్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. ఇవి ఆందోళన కలిగిస్తోంది. కరోనా బాధితుల ఊపిరితిత్తులపై వైరస్ తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నట్లుగా ఇప్పుడు తేలింది.

ctscan2 newsmart9

RTPCR టెస్టుల్లో నెగటివ్ రిపోర్టు ప్రశ్నార్థకంగా మారుతుందని వడోదర ప్రైవేట్ హాస్పిటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డా. కృతేష్ షా తెలిపారు. దీనిద్వారా కరోనా నిర్ధారణ కాని ఒక వ్యక్తి ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతిన్నాయని చెప్పారు.

ప్రస్తుతం రేడియాలాజికల్ పరీక్షల్లోనే వైరస్ తీవ్రత బయటపడుతోంది. ఈ పరీక్షల తర్వాత రోగులు వైద్యం కోసం హాస్పిటల్ లో చేరుతున్నారు. రాజ్ కోట్ లో కూడా ఇలాంటి కేసులు నమోదు అవుతున్నాయి. ఇక్కడ కూడా RTPCR లో నెగటివ్ చూపించిన రోగులు న్యుమోనియా బారిన పడిన సందర్భాలు ఉన్నాయి.

కరోనా లక్షణాలు ఉన్న వారికి RTPCR పరీక్షలో నెగెటివ్ రిపోర్టు వస్తే కొన్ని రోజుల తర్వాత CT Scan చేయించుకోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాధి లక్షణాలు ఉన్నవారు RTPCR తో పాటుగా సీటీ స్కాన్ కూడా చేయించుకోవాలని సిఫార్సు చేస్తున్నారు. దీని వల్ల సాధ్యమైనంత త్వరగా వైరస్ ను గుర్తించి రోగులకు చికిత్స అందించవచ్చు అని అంటున్నారు.

దీనిపై ilbs ఇన్స్టిట్యూట్ మైక్రో బయాలజీ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభ కాలే తన అభిప్రాయాన్ని చెప్పారు. ఇలాంటి పేషంట్లకు కరోనా వైరస్ ముక్కు, శ్వాస రంధ్రాలు, గొంతులో ఎటువంటి లక్షణాలు చూపట్లేదు. అంటే ఆ ప్రాంతాల్లో కరోనా లేనట్లే. RTPCR టెస్టులో ముక్కు నుంచి స్వాబ్ సాంపిల్స్ తీసుకుంటారు, టెస్ట్ చేస్తారు. ఆ స్వాబ్ ప్రాంతంలో వైరస్ ఉండట్లేదు కాబట్టి ఆ టెస్టులో వైరస్ లేనట్టుగా చూపిస్తుంది.

అలా కాకుండా ఊపిరితిత్తుల నుంచి లిక్విడ్ సేకరించే విధానంలో.. అక్కడ వైరస్ ఉంటుంది కాబట్టి ఆ విధంగా వైరస్ ఉన్న విషయం బయట పడుతుందని చెప్పారు. కాబట్టి RTPCR టెస్టులో కరుణ నెగటివ్ వచ్చి కరోనా లక్షణాలు ఉంటే వెంటనే CT Scan టెస్ట్ కూడా చేసుకోవడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

RTPCR టెస్ట్ కచ్చితత్వం 70 శాతం మాత్రమే. అంటే ఇవి ప్రతికూల ఫలితాలు చూపించే అవకాశం 30 శాతం వరకు ఉంటుంది. కొన్నిసార్లు నమూనాల సేకరణ సరిగ్గా చేయకపోవడం, టెస్టింగ్ వైఫల్యాల వల్ల కూడా ఇలా జరగవచ్చు అని చెబుతున్నారు. అందువల్ల లక్షణాలు ఉండి కూడా ఈ టెస్టుల్లో నెగిటివ్ వచ్చిన వారు మాత్రం వైరస్ నిర్ధారణ కోసం వెంటనే CT Scan చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

Leave a Comment