స్మోకింగ్ చేస్తున్న పీత .. సోషల్ మీడియాలో వైరల్ ..

స్మోకింగ్ చేస్తున్న పీత : ధూమపానం, మధ్యపానం ఆరోగ్యానికి హానికరం. అందుకే ప్రభుత్వాలు వాకిటి సంభందించిన సన్నివేశాలను సినిమాలలో. .సీరియల్స్ లో కూడా నిషేధించింది. సాధారణంగా మనుషులు మాత్రమే ఈ ధూమపానం చేస్తూ ఉండటం చూసి ఉంటాము.

కానీ ఇప్పుడు ఆ పరిధి దాటి జంతువుల వరకూ వెళ్ళింది. వాటికీ మన మానవ జాతి అలవాటులో సోకినట్టున్నాయి. దీనికి సంభందించిన కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ పీత స్మోకింగ్ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎవరో తాగి పడేసిన సిగరెట్ పీకను పట్టుకుని అదీ స్టయిల్ గా తాగటం మొదలుపెట్టింది. ఇది గమనించిన కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

Leave a Comment