ప్లాస్మా దానంపై మరింత అవగాహన కల్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన వీడియోను సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఆవిష్కరించారు.
గచ్చిబౌలిలోని సైబరాబాద్ కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం సాయంత్రం ఈ కార్యక్రమం జరిగింది.కరోనా వ్యాధిన పడ్డవారికి ప్లాస్మా ఏ విధంగా ఉపయోగపడుతుందో, వారి ఆరోగ్యాన్ని ఎలా కాపాడుతుందో అవగాహన కల్పించడం ఈ వీడియో లక్ష్యం. ‘జబర్దస్త్’ కళాకారులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్‌లతో ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ ఈ లఘు వీడియో చిత్రాన్ని రూపొందించారు.
ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ… కరోనా వ్యాధి నుంచి కోలుకున్న ప్రతి ఒక్కరూ ప్లాస్మా దానం చేయడానికి స్వచ్ఛందంగా ముందుకు రావాలని కోరారు. సైబరాబాద్ పోలీసులు, ఎస్‌సీఎస్‌సీ ద్వారా ప్లాస్మా దానంపై చేస్తున్న కృషికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందన్నారు. కార్యక్రమంలో సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ ఎస్‌ఎం విజయకుమార్, ఏడీసీపీ ఈఓడబ్ల్యూ ప్రవీణ్‌కుమార్, ఏసీపీ హన్మంతరావు, ‘జబర్దస్త్’ కళాకారులు రాంప్రసాద్, సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను తదితరులు పాల్గొన్నారు.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …