కరోనా వైరస్ పంజా విసురుతున్న నేపథ్యంలో ఇంట్లో వుండే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వుండాలని పలువురు డాక్టర్లు సూచిస్తున్నారు. దీనికి కారణం పళ్లు తోముకునే టూత్ బ్రష్‌లతోనూ ముప్పు పొంచి ఉండటం.
కొందరు లక్షణాలు లేకుండానే కరోనా బారినపడుతున్నారని, అందుకు వారు వాడే టూత్ బ్రష్‌లు ఒక కారణంగా చెబుతున్నారు. ఆ విషయం తెలియక కరోనా చికిత్స తీసుకుంటున్న వారు అందరి బ్రష్‌లతో కలిపి వాటిని కూాడా పెట్టడం వల్ల కరోనా కారకాలుగా మారే అవకాశం ఉందని యూకే నుంచి వెలువడిన బీఎంసీ మెడికల్ జర్నల్‌లో ఒక అధ్యయనం ద్వారా పేర్కొన్నారు. ( లాక్డౌన్ కి కౌంట్ డౌన్ .. !! )
కాబట్టి ఇంట్లోని అందరూ తమ బ్రష్‌లను ఒకే చోట కాకుండా వేరు వేరు ప్రదేశాలలో పెట్టాలని దంత వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలాగే కొన్ని రోజులవరకు పేస్టు కూడా విడివిడిగా వాడటమే మంచిదంటున్నారు. కరోనా సోకినవారు వాడే టూత్‌పేస్టును మిగతా కుటుంబ సభ్యులు వాడడం వల్ల వారికి వైరస్ సోకే ముప్పు 33 శాతం అధికమని ఈ అధ్యయనంలో వెల్లడైనట్టు పేర్కొంది. కాబట్టి ఎవరి బ్రష్‌లు, పేస్టులను వారే విడిగా వాడటం మంచిదని సూచించింది.
మరోవైపు, కరోనా బారినపడిన వారు ఐసోలేషన్ పూర్తయ్యాక వారు వాడిన బ్రష్‌లు, పేస్టులు ఇతర వస్తువులు మరల తిరిగి వాడకూడదని నిపుణులు చెబుతున్నారు. వాటి ఉపరితలంపై 72 గంటలపాటు వైరస్ ఉంటుందని, కాబట్టి ఐసోలేషన్ పూర్తయిన తర్వాత వాటిని వాడకపోవడమే మంచిదని పేర్కొన్నారు. మౌత్ వాష్‌లతో బ్రష్‌లను శుభ్రం చేయడం ద్వారా 39 శాతం ముప్పు తగ్గుతుందంటున్నారు.
వైరస్ సోకిన వ్యక్తులు రోజుకు మూడుసార్లు 0.2 క్లోర్‌హెక్సిడైన్ ఉన్న ఏదైనా మౌత్‌వాష్‌ను పుక్కిలించడం ద్వారా వైరస్ ప్రభావం నుంచి కొంతవరకు బయటపడవచ్చని చెబుతున్నారు. అలాగే ఈ మౌత్ వాష్‌లలో 30 సెకన్లపాటు బ్రష్‌ను ముంచినా 99 శాతం వైరస్ నాశనం అవుతుందని అధ్యయనంలో తేలింది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …