గాలి ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్.. !

కరోనా వ్యాధి పై ప్రభుత్వ మెడికల్ జనరల్ లాన్సెట్ (Lancet) సంచలన విషయాలను వెల్లడించింది. గాలి ద్వారానే కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా జరుగుతోందని ప్రకటించింది. గాలి ద్వారా వైరస్ సోకుతుందనడానికి తమ దగ్గర బలమైన ఆధారాలు ఉన్నాయని తెలిపింది.

గాలి ద్వారా కరోనా వ్యాపిస్తుంది అనే విషయాన్ని గుర్తించక పోవడం వల్లే ఎక్కువమంది వైరస్ బారిన పడుతున్నట్లు లాన్సెట్ వెల్లడించింది. అమెరికా, బ్రిటన్, కెనడా కు చెందిన ఆరుగురు నిపుణులు తమ అధ్యయనంలో ఈ సంచలన విషయాలను గుర్తించారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ త్వరగా గుర్తించాలి

కరోనా వైరస్ గాలి ద్వారా వ్యాపిస్తుంది అనే విషయాన్ని ప్రజలకు తెలియజేసి తగిన చర్యలు చేపట్టాలని లాన్సెట్ సూచించింది. ఇప్పటికైనా ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO తమ శాస్త్రీయ ఆధారాలను గుర్తించి గాలి ద్వారా వ్యాపించే వైరస్ గా కరొనాను ప్రకటించాలని కోరింది. కరోనా వైరస్ నియంత్రణకు ఇళ్లు, కార్యాలయాల్లో వెంటిలేషన్ మెరుగ్గా ఉండడంతో పాటు ఎయిర్ ఫిల్టరైజేషన్ సరిగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపింది.

ఎక్కువ మంది గుమికూడినా.. నాలుగు గోడల మధ్య ఎక్కువసేపు గడిపినా వైరస్ త్వరగా సోకే అవకాశముందన్నారు. నిశ్శబ్ద సంక్రమణ ద్వారానే అధిక శాతం మంది ఈ వైరస్ బారిన పడుతున్నారని లాన్సెట్ తెలిపింది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదు కావడానికి ఈ నిశ్శబ్ద సంక్రమణే కారుణమన్నారు. వేర్వేరు గదుల్లో ఉన్నా, కరోనా రోగులతో నేరుగా ఎదురు పడకపోయినా వైరస్ సోకుతుందని చెబుతున్నారు.

ఇక ఇంట్లో ఉన్నా, ఆఫీసులో ఉన్నా కచ్చితంగా మాస్క్ ధరించాలని సూచించింది. అలాగే ఖచ్చితంగా నాణ్యతా ప్రమాణాలు ఉన్న మాస్క్ లనే వాడాలని లాన్సెట్ తెలిపింది. వైరస్ సంక్రమణ రేటు బయటి కంటే నాలుగు గోడల మధ్యే ఎక్కువగా ఉందని.. ఒక వేళ వెంటిలేషన్ ఎక్కువగా ఉంటే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చు అని వెల్లడించింది.

Leave a Comment