కరోనా కొత్త ట్రెండ్.. ఈ సారి పిల్లలపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్న సైంటిస్టులు..

కరోనా మహమ్మారి యూరప్, అమెరికాలను అతలాకుతలం చేస్తున్నా ఆసియాలో.. ముఖ్యంగా భారత్లో అదుపులోనే ఉంది. మన దేశంలో గత కొన్ని రోజులుగా కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పడుతున్నాయి.

మరోవైపు కొద్దిరోజుల్లో వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి వస్తుందన్న ప్రభుత్వ ప్రకటనతో ఇపుడిప్పుడే అంతటా కుదుటపడుతున్న పరిస్థితి. సరిగ్గా ఇదే సమయంలో ఇప్పుడు కొత్త వైరస్ ట్రెండ్ కలకలం రేపుతోంది.

ఇప్పటికే యూకేతో పాటు ఐదు దేశాల్లో ఈ వైరస్ విజృంభణ ప్రారంభమైంది. దీంతో అప్రమత్తమైన దేశాలు యూకేతో విమాన రాకపోకలు రద్దు చేసుకున్నాయి. తాజాగా భారత్ కూడా యూకే నుంచి విమాన రాకపోకలు పై నిషేధం విధించింది.

ఇప్పటికైతే కొత్తరకం కరోనా వైరస్ భారత్లో వెలుగు చూడనప్పటికీ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్రం హెచ్చరిస్తోంది. ఎందుకంటే ఈ కొత్తరకం కరోనా మునుపటి కన్నా 70 శాతం ఎక్కువగా విజృంభిస్తుండడంతో పాటుగా చిన్నారులకు తొందరగా సోకుతుందట. అందుకే చిన్న పిల్లల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు.


నాన్ వేరియెంట్ వైరస్ ల కంటే ఈ కొత్తరకం వైరస్ ఎక్కువగా 15 ఏళ్ల లోపు చిన్నారులకు సోకే అవకాశం ఉందని యూకే ప్రభుత్వానికి చెందిన గవర్నమెంట్ న్యూ అండ్ ఎమర్జింగ్ రెస్పిరేటరీ అడ్వైసరీ గ్రూప్ స్పష్టం చేసింది. సూక్ష్మంగా నెర్వ్ టాగ్ అని పిలిచే ఈ గ్రూప్ కు చెందిన వైరస్ చిన్న పిల్లలపై ఎక్కువగా ప్రభావం చూపుతోందని ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

దీనికి సంబంధించి ఐదు లేదా ఆరు వారాల వ్యవధిలో రెండు కేసులు కూడా నమోదు అయినట్టుగా గుర్తించామన్నారు. అయితే ఈ వైరస్ పిల్లలలో ఎక్కువగా వ్యాపిస్తుంది అనడానికి ఎక్కువ డేటా అవసరం ఉందని కూడా చెప్పారు.

పిల్లలపై కొత్తరకం వైరస్ ఎంతవరకు ప్రభావం చూపిస్తుందో పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉందని ప్రొఫెసర్ వెన్డీ బార్క్లే తెలిపారు. కేవలం చిన్నారులపైనే దాడి చేస్తోందని కూడా అనలేమని చెప్పారు. ఇప్పటి వరకు సార్స్ కోవిడ్ 2 వైరస్ పెద్ద వాళ్ళ కంటే చిన్నారుల్లోనే చాలా తక్కువగా ఉందని.. ఇతర అంటువ్యాధుల వలన కాదని బార్ క్లే పేర్కొన్నారు.

ఈ కొత్తరకం వైరస్ సులభంగా కణాలలోకి ప్రవేశించగలదని తద్వారా చిన్నారుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అందులోనూ ఎక్కువగా మట్టి మైదానాల్లో ఆడుకునే పిల్లల్లో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుందని తెలిపారు. పెద్దవారిలా ఇప్పుడు చిన్నారులకు కూడా వైరస్ సమానంగా వ్యాపించవచ్చును అని అంటున్నారు.

కొత్తగా మ్యుటేషన్ అయిన ఈ స్ట్రైన్ 50 శాతానికి పైగా ఒకరి నుంచి మరొకరికి సులభంగా వ్యాపించి గలదని.. గత కరోనా వైరస్ కంటే అత్యంత ప్రాణాంతకమైనది కావొచ్చునని ప్రొఫెసర్ నీల్ ఫెర్గ్యూసన్ హెచ్చరిస్తున్నారు. దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు కూడా ఉన్నాయి అని అన్నారు.

Leave a Comment