Bio-war | కరోనా సెకండ్ వేవ్ భారత్ లో విలయ తాండవం సృష్టిస్తోంది. ఇప్పుడిప్పుడే కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్నా, ఇప్పటికే చాలా నష్టం జరిగిపోయింది. దాదాపు రెండు నెలల పాటు మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసింది. మరి కరోనా మొదటిదశను పక్కా ప్రణాళికతో ఎదుర్కొన్న భారత్.. రెండో దశలో ఎందుకు ఇబ్బందులు పడాల్సి వచ్చింది.?
ఫస్ట్ వేవ్ ను అడ్డుకోవడంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన మనం, సెకండ్ వేవ్ ను ఎందుకు అదుపుచేయలేక పోయాము. అసలు ప్రపంచంలో ఎక్కడా లేనట్లుగా డబుల్ మ్యూటెంట్ అనే పదం భారత్ లోనే మొదట ఎందుకు వినిపించింది. కరోనా రెండో దశ విధ్వంసం భారత్ ని ఎందుకింతగా బాధిస్తోంది.
Bio-war కాక మరేమిటి
కరోనా అంటేనే దేశ విదేశాల్లో విస్తరించిన వైరస్ మహమ్మారి. అలాంటి కరోనా రెండో దశలో భారత్ నే ఎందుకు ఎక్కువగా బాధిస్తుంది. మన పక్కనున్న బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్ లో కనపడని రెండోదశ విధ్వంసం.. వినపడని డబల్ మ్యూటెంట్ అనే పదం, ఏదో పగ పట్టినట్టు భారత్ నే ఎందుకు ఇంతలా టార్గెట్ చేసింది. అంటే మిగతా ఉపఖండ దేశ ప్రజల కంటే భారతదేశ ప్రజలు అంత నిర్లక్ష్యంగా ఉన్నారా .. ఏదో తేడా జరిగినట్టు అనిపిస్తుంది కదా..
దీనిపై లోతుగా అధ్యయనం చేస్తే ఒక భయంకరమైన నిజం బయటపడింది. అదే బయోవార్( Bio War ). ఇది భారత్ పై ఒక పద్దతి ప్రకారం జరిగిన ఒక భయంకరమైన బయోవార్. అమెరికా మరియు చైనా కలిసి చేసిన పెద్ద కుట్రగా ఇది కనిపిస్తోంది. పైకి బద్ధ శత్రువులుగా కనిపిస్తున్నా తమ ప్రాభవాన్ని కాపాడుకోవడానికి ఇలా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది.
వైరాలజీ ఎక్స్పర్ట్ Dr. Anthony Fauci చైనాలోని వుహాన్ బయాలజీ ల్యాబ్ కి నిధులు సమకూర్చడమే కాకుండా ఈ భయంకరమైన వైరస్ రూపకల్పనలో పాలు పంచుకున్నారని రిపబ్లికన్ పార్టీ సెనేటర్ ర్యాండ్ పాల్ సంచలన ఆరోపణలు చేశారు.
ఎవరు ఈ Dr. FAUCI
Dr. Anthony Fauci అమెరికాలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈయన మిగతా హెల్త్ ఏజన్సీస్ తో కలిపి 2014 నుంచి 2019 మధ్య వుహాన్ వైరాలజీ ల్యాబ్ కి భారీగా నిధులు సమకూర్చినట్లు ఆయన ఆధారాలు బయటపడ్డాయి. ఇప్పుడు అదే Dr. Fauci భారత్ కు సెకండ్ వేవ్ పై సలహాలు, సూచనలు చేస్తూ ఉండటం, ఆయనకు లుటియెన్స్ మీడియా కవరేజ్ ఇస్తుండటం అనేక అనుమానాలకు బీజం వేస్తుంది.
మరోవైపు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ఓ మీట్ లో తన చైనా పర్యటన వివరాలను తెలుపుతూ.. బయోవార్ గురించి ప్రస్తావిస్తూ వైరస్ల ద్వారా రానున్న కాలంలో జరిగే పెను విపత్తు పరిస్థితులను అంచనా వేస్తూ మాట్లాడారు. చైనాలోని వైరాలజీ ల్యాబ్ గురించి విశ్లేషిస్తూ తన వెబ్సైట్లో ఓ వ్యాసాన్ని కూడా రాశారు.
బిల్ గేట్స్ కూడానా
గేట్స్ ప్లాండేషన్ పేరిట పేద దేశాలను ఆదుకుంటామని చెప్పే బిల్ గేట్స్, వాక్సిన్ ఫార్ములాకు పేటెంట్ వుంచకూడదు అన్న చిన్న దేశాల అభ్యర్ధనలను తోసిపుచ్చారు. ఇలా చెప్పడం ఫార్మా లాబీకి ఇది సంకేతమని మనం అర్ధం చేసుకోవచ్చు. ఈ పరిణామాలన్నీ డోనాల్డ్ ట్రంప్ దిగిపోయిన తర్వాత మొదలైనవి కావడం విశేషం.
అమెరికా ఎన్నికలకు ముందు మళ్లీ అధికారంలోకి వస్తే నాటో దేశాల బాధ్యతల నుంచి తప్పుకుంటానని ట్రంప్ ప్రకటించారు. ఇది గ్లోబల్ ఆయుధ ఫార్మకి మింగుడు పడని అంశం. అలాగే కరోనా సమయంలో చైనాకు అనుకూలంగా డబ్ల్యూహెచ్వో పనిచేస్తోందని.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు ( WHO ) అమెరికా నిధుల్ని నిలిపివేస్తామని ట్రంప్ ప్రకటించారు. ( What about China vaccine )
ట్రంప్ ని దించడంలో తమవంతుగా
ఇవి గ్లోబల్ ఫార్మా లాబీ కి మింగుడు పడని అంశం. డబ్ల్యూహెచ్వో నిబంధనల ముసుగులో కొత్త కొత్త మందులు ప్రజల పై రుద్దుతూ కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఫార్మా కంపెనీలు డబ్ల్యూహెచ్వో ( WHO )కు వెన్నుదన్ను గా నిలిచాయి. ఈ ఆయుధ మరియి ఫార్మా లాబీలు ట్రంప్ ఉంటే తమ ఆటలు సాగవు గనుక, ట్రంప్ ని దించేందుకు కుట్రలుపన్ని తమ సహాయ శక్తులా ప్రయత్నాలు చేశారు. అందులోనుంచి వచ్చిందే బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ( Black Lives Matter ) ఉద్యమం. అదే ట్రంప్ ఓటమికి దారితీసింది.
ఇప్పుడు అవే శక్తులు టార్గెట్ మోడీగా పనిచేస్తున్నాయి. ఎందుకంటే మోడీ కూడా ట్రంప్ లాగా జాతీయవాదాన్ని తీసుకురావడం మొదలుపెట్టాడు. మేక్ ఇన్ ఇండియా ( Make In India ), స్టార్ట్ అప్ ఇండియా ( Start up India ) అంటూ కదిలాడు. అందులో భాగంగానే కరోనాకి విరుగుడుగా వాక్సిన్ లను కూడా తయారుచేసే రెండు మన దేశీయ కంపెనీలను ప్రోత్సహించాడు.
ఇలా ఇండియానే అన్ని వాక్సిన్ లు సప్లై చేస్తే తమ పబ్బం గడిచేదెలా అనుకున్న ఫార్మా లాబీలు చైనా మరియు అమెరికాలతో కుట్రలకు తెరతీశాయి. సహజంగానే ఇక్కడ తయారు చేస్తున్న వాక్సిన్ లకు సంభందించిన ముడి పదార్ధాలు చైనా, అమెరికాలనుండి దిగుమతి అవుతూవుంటాయి. అందువలన ఈ వాక్సిన్ ఉత్పత్తికి అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతో ఆయా దేశాలను గుప్పెట్లో పెట్టుకుని ముడి పదార్ధాల కృతిమ కొరత సృష్టిసున్నాయి.
కరోనా మొదటి దశలో అమెరికాకు hydroxychloroquine ను అందించిన భారత్ , ఈ ముడి పదార్ధాల కృత్రిమ కొరతతో వాక్సిన్ ను తగినంత మోతాదులో ఉత్పత్తి చేయలేక పోతోంది. ఇదే రకంగా వాక్సిన్ తయారీలో అడ్డుపడితే ఈ బయోవార్ మూడో దశ రూపంలో మనపై విరుచుకుపడే అవకాశం వుంది.
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్… తెలంగాణా ఆర్.టి.సీ. ప్రత్యేక ఆఫర్..!దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో దేశమంతటా ఆజాదీ కా …
- Heavy rains: మరో రెండు రోజుల పాటు తెలంగాణ అంతటా భారీ వర్షాలుHeavy rains:ఈరోజు తెల్లవారుజామున హైదరాబాద్ పట్టణ, పరిసర ప్రాంతాల్లో కురుసిన భారీ వర్షంతో …
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …