కరోనా విజృంభిస్తోంది. ఆ వైరస్ ఎప్పుడు ఎక్కడ నుంచి ఎలా.. ఎవరికి సోకుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. చాపకింద నీరులా తన ప్రతాపాన్ని చూపుతోంది.
ఇంటినుంచి బయటకు వెళ్లకుండా ఉంటే క్షేమంగా ఉండొచ్చని చెబుతున్నా.. ఇంటినుంచి బయటకు రాని వారిని సైతం ఆ మహమ్మారి వదలడం లేదు. ఇది నగదు లావాదేవీల ద్వారా కూడా సోకుతోంది. కరెన్సీ నోట్లపై ఉన్న వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతోంది. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు కరెన్సీకి బదులుగా డెబిట్, క్రెడిట్ కార్డులు ఎక్కువగా వాడుతున్నారట. దీంతో కేవలం మూడు నెలల కాలంలోనే (ఏప్రిల్ నుంచి జూన్ వరకు) దేశంలో బ్యాంకుల నుంచి 1.6కోట్ల డెబిట్ కార్డులను కొత్తగా తీసుకున్నారట. ( వీడియో కాలింగ్ ఆప్షన్ .. టెలిగ్రామ్ లో .. )
ఈ లెక్కలను ఇటీవల ఆర్‌బీఐ విడుదల చేసింది. మార్చి నెలాఖరు వరకు దేశంలో 82.85 కోట్ల డెబిట్ కార్డులుంటే జూన్ నెలాఖరు నాటికి వాటి సంఖ్‌య 84.54 కోట్లకు చేరాయి. డెబిట్ కార్డుల జారీలో ప్రైవేటు బ్యాంకుల కంటే ప్రభుత్వ బ్యాంకులే ముందున్నాయట. దీనిని బట్టి చూస్తుంటే కరోనా నివారణకు ప్రజలు ఎంత జాగ్రత్త పడుతున్నారో అర్ధం అవుతుంది కదా.. ఇలా ముందుచూపుతో వ్యవహరించడం మంచి పరిణామమే మరి.
- 14.29 శాతం ఫిట్మెంట్ పై సీఎం జగన్కు సీఎస్ కమిటీ నివేదికఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ …
- నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్న వైస్ జగన్.. ఎదురు చూస్తున్న ఒడిశా సరిహద్దు ప్రాంత ప్రజలుఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుకు చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. అదే సమయంలోనే దశాబ్దకాలం …
- కుప్పం మున్సిపాలిటీలో Ex-Officio సభ్యునిగా దరఖాస్తు.. బాబు పరిస్థితి ఇలా అయ్యిందేంటి..?కుప్పం మున్సిపాలిటీలో తన పార్టీ గెలుపుపై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు …
- పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పుడు ఏమైపోయారు బాబు గారు ..?దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పరుగులు తీయడం మొదలై చాలా కాలమే అయింది. …
- ఇరు పార్టీలు సంయమనం పాటించండి.. లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణజయప్రకాష్ నారాయణ కామెంట్స్ : ఏపీలో రాజకీయాలు గరంగరంగా మారుతున్నాయి. అధికార పార్టీ …