కేసీఆర్ ను టార్గెట్ చేయబోయి తానే ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి..!

ఇబ్బందుల్లో పడ్డ రేవంత్ రెడ్డి : రేవంత్ రెడ్డి పిసిసి పగ్గాలు చేపట్టాక కొత్త ఉత్సాహం పెల్లుబికేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. నిజానికి రేవంత్ కు పార్టీ పగ్గాలను ఇవ్వడం ఇష్టంలేని వారు కాంగ్రెస్ లో చాలా మంది ఉన్నారు. దీంతో రేవంత్ కు కష్టాలు తప్పవని.. పార్టీ పుంజుకోవడం కష్టమని పెద్దఎత్తున విశ్లేషణలు, విమర్శలు అయితే వచ్చా. కానీ వీటిని సవాల్ గా తీసుకున్న రేవంత్ రెడ్డి ఒకవైపు అధికార పార్టీ టీఆర్ఎస్ పై వ్యూహాత్మకంగా ఎదురుదాడి చేస్తూనే.. మరోవైపు కాంగ్రెస్ పటిష్టతకు నడుం బిగించి ముందుకు సాగారు.

మామూలుగానే కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఈ క్రమంలో ఎవరికి వారు తమకు తామే పెద్దలమన చెప్పుకుంటూ వుంటారు. అందుకే రేవంత్ ను గుర్తించడం కష్టమే. దీనిని గమనించిన రేవంత్ రెడ్డి ప్రతి ఒక్క నేతను కలిసి పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. ( నా తడాఖా చూపిస్తా ..! కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి )

హుజురాబాద్ లో కాంగ్రెస్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ మరీ దారుణంగా ఓడిపోతుందని మాత్రం ఊహించలేదు. దీంతో ఒక్కసారిగా కాంగ్రెస్ లో పరిస్థితులు మారిపోయాయి. రేవంత్ పై సొంత పార్టీ నేతల దాడి పెరిగింది. రేవంత్ టార్గెట్ గా పదునైన విమర్శలు చేస్తున్నారు. రేవంత్ వల్లే హుజురాబాద్ లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయిందన్న విమర్శలు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి మాట చెల్లుబాటు అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

ఈ మధ్య రేవంత్ కొన్ని స్థానాల్లో తన సన్నిహితులకే టిక్కెట్లు ఖరారు చేసినట్లు చెప్పినట్లు వారట్లు కూడా వచ్చాయి. పెద్దపల్లి సీటు విజయ రమణ రావుకు, భూపాలపల్లి సీటు గండ్ర సత్యనారాయణకు ఫిక్స్ అని రేవంత్ రెడ్డి చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సీనియర్లు రేవంత్ పై గుర్రుగా ఉన్నారు. రేవంత్ ఎలా సీట్లు ఫిక్స్ చేశారని ఫైర్ అవుతున్నారు పార్టీలో వున్న పెద్దలు.

పెరుగుతున్న డెంగ్యూ కేసులు..

భూపాలపల్లి, పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక ఇంకా ఫైనల్ కాలేదని.. టిక్కెట్లు ఇచ్చే అర్హత రేవంత్ కు లేదని పలువురు సీనియర్ల మాట్లాడుతున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో టికెట్లు కేటాయించేది ఏఐసీసీ మాత్రమేనని.. రేవంత్ టికెట్ కూడా ఏఐసీసీనే ప్రకటిస్తుందని.. అలాంటిది పెద్దపల్లి, భూపాలపల్లి సీట్లు ఎలా ప్రకటిస్తారని సీనియర్ నాయకులూ ప్రశ్నించారు. ఇటీవల జరిగిన కాంగ్రెస్ పొలిటికల్ పార్టీ సమావేశంమే వీరి ఆగ్రహానికి వేదికగా మారింది. మొత్తానికి హుజురాబాద్ ఉపఎన్నిక ఫలితం రేవంత్ ను ఇబందుల్లోకి నెట్టినట్టే కనిపిస్తోంది.

Leave a Comment