కాంగ్రెస్ పార్టీనా .. మజాకా..!!

రాజకీయాలంటేనే చిత్రవిచిత్రంగా ఉంటాయి. ఎవరికి ఎప్పుడు ఎలా కలిసి వస్తాయో చెప్పలేము. ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీలో సీనియర్ లీడర్ ఆజాద్‌కు అలాంటి పరిస్థితే ఎదురైంది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేత గులాంనబీ ఆజాద్‌కు ఆ పార్టీ అధిష్ఠానం గట్టి షాకే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆజాద్‌ను తొలిగించడంతో చర్చ మొదలైంది. ఆజాద్‌తో పాటూ అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్‌ వోరా తదితరులపై కూడా వేటు పడింది.

లేఖనే కారణమా..

కాంగ్రెస్‌ పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేతలు బహిరంగ లేఖ రాశారు. అతడిపై పార్టీ వేటుకు ఆ లేఖే కారణమన్న ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. ఈ లేఖరాసిన వారిలో ఆజాద్‌ ముఖ్యుడు. ఈ విషయంపై పార్టీలో తీవ్ర దుమారమే చెలరేగింది. కాంగ్రెస్‌ యువనేత రాహుల్‌ గాంధీ సైతం పార్టీ సీనియర్లపై గుర్రుగా వున్నారు.

కాగా కాంగ్రెస్‌ పార్టీ తాజాగా సీడబ్ల్యూసీని పునర్వ్యస్థీకరణలో భాగంగా ఈ కమిటీలోని పలువురు సీనియర్లను సైతం పక్కన పెట్టేందుకు సాహసించింది. ఆజాద్‌ ఇప్పటివరకు యూపీ కాంగ్రెస్‌ ఇంచార్జిగా వ్యవహరిస్తూ వున్నారు. ప్రస్తుతం ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు. అదేవిధంగా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా ఇప్పటివరకు ఇంచార్జిగా ఉన్న కుంతియాను తప్పించి మాణికం రాకూర్‌ను ఇంచార్జిగా కాంగ్రెస్‌ పార్టీ నియమించింది.

ఆంధ్రప్రదేవ్‌ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా ఉమెన్‌చాందీని మరియు యూపీ కాంగ్రెస్‌ ఇంచార్జిగా ప్రియాంకాగాంధీని కాంగ్రెస్‌ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది. ఇప్పటికైనా కాంగ్రెస్‌ అధిష్టానం పార్టీలోని సీనియర్లను పక్కన పెట్టి యువతకు అవకాశం కల్పించడం వలన పార్టీ మళ్లీ పుంజుకుంటుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

Leave a Comment