పుట్టిన రోజు ముందు.. మహేష్ కూడా అదే దారి..!

సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలలోనే కాదు ,సామజిక కార్యక్రమాలలో కూడా సూపర్ స్టార్ అనిపించుకున్నారు.
ఈమధ్య సినిమాలలో కూడా సమాజ సేవకు సంబందించిన కథలనే ఎంచుకుంటున్నాడు.
తాజాగా మహేష్, కరోనా జాగ్రత్తలు మరియు దాని నుండి బయటపడటానికి అందుబాటులోకి వచ్చిన ప్లాస్మా దానం పై ఒక లేఖను విడుదల చేసారు.
ఆ లేఖలో సీపీ సజ్జనార్ కు అభినందనలు తెలుపుతూ, ” ప్రస్తుత పరిస్థితుల్లో మనమందరం ఒకరికొకరం తోడుగా ఉండాలి. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మన ప్రాణాలను నిలబెట్టడానికి ప్లాస్మా థెరపీ ఎంతగానో ఉపయోగ పడుతుంది.
సీపీ సజ్జనార్ ప్లాస్మా దానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేసే ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
దానికి సహకరించి ముందుకు వచ్చిన దాతలందరికి అభినందనలు. సాటి మనుషుల ప్రాణాలను కాపా డేందుకు ఉపయోగపడే ప్లాస్మాను దానం చేయాలనీ కోరుతున్నా”, అని అన్నారు.

Leave a Comment