స్వర్ణ ప్యాలెస్ ఘటన..విచారణ కమిటీ నివేదిక..

IMG 20200819 WA0006

స్వర్ణ ప్యాలెస్ లో అగ్నిప్రమాదం జరిగి 10మంది కోవిడ్ బాధితులు చనిపోయిన ఘటనకు సంభందించి ప్రభుత్వం సూచించిన కమిటీ నివేదిక ఇచ్చింది.

అందులోని వివరాలు చూస్తే, ప్రభుత్వ అనుమతి లేకుండానే స్వర్ణ ప్యాలెస్ ను రమేష్ హాస్పిటల్ యాజమాన్యం కోవిడ్ సెంటర్ గా ఏర్పాటు చేసిందని తెలిపింది.

ఆ భవనం మున్సిపల్ కార్పోరేషన్ పన్నులు కూడా సరిగా కట్టలేదని, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా లేదని తెలిపారు. అలాగే రమేష్ హాస్పిటల్ వారు కోవిడ్ నిబంధనలు తుంగలో తొక్కారని, వైద్య విలువలు నీరుగార్చారని నివేదించింది.( భారీ అగ్ని ప్రమాదం..)

ఇంకా ఏమన్నారంటే..

అవసరం లేకున్నా కరోనా అనుమానితులుగా ఉన్న వారికి అనవసర పరీక్షలు చేయడం, రెండిసీవర్ వాడకం మరియు అనుమతి లేకుండా ప్లాస్మా ట్రీట్మెంట్ ఇచ్చారని నివేదికలో పేర్కొన్నారు.

Leave a Comment